పసిడి పరుగు
- తులంపై రూ.520 పెరుగుదల
- రూ.1,000 అధికమైన కిలో వెండి

న్యూఢిల్లీ, మే 26: అంతర్జాతీయ మార్కెట్లకు తోడు, దేశీయంగా పెళ్ళిళ్ళ సీజన్‌తో డిమాండ్ అధికమవడంతో ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన తులం బంగారం ధర రూ.520 అధికమై రూ.48,580 పలికింది. పెరుగకముందు ధర రూ.48 వేల స్థాయిలో ఉన్నది. దీంతో గడిచిన రెండు నెలల్లో పుత్తడి ఏకంగా రూ.5 వేలు పెరిగినట్లు అయింది. అలాగే, పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో కిలో వెండి రూ.1,040 ఎగబాకి రూ.71,770కి చేరుకున్నది. సెకండ్ వేవ్ కారణంగా పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఈక్విటీల నుంచి సురక్షితమైన అతి విలువైన లోహాల వైపు మళ్లించడం కూడా ధరలు పెరుగడానికి ప్రధాన కారణమని బంగారం వర్తకులు చెబుతున్నారు. న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర నాలుగున్నర నెలల గరిష్ఠ స్థాయి 1,900 డాలర్లు దాటడంతో దేశీయంగా ధరలు పెరిగాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- gold
- gold-jewellery
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కాజోల్.. బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో కనిపించనున్నారా?
Irumudi | రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు.. బాలనటి నిబంధనలపై విచారణకు ఆదేశం!
Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం
Raptadu incident | వరుసకు బాబాయ్..! పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి, రాప్తాడు ఘటనలో కీలక విషయాలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

