Gold Price | వరుసగా మూడో రోజు తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏకంగా రూ. 2500 తగ్గిందిగా!
Gold and Silver price | బంగారం (Gold) కొనే ఆలోచనలో ఉన్న వాళ్లకు ఇదే మంచి తరుణం. ఎందుకంటే గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Gold price) మెల్లమెల్లగా తగ్గుతూ వస్తున్నాయి. మళ్లీ ఏ క్షణమైనా అమాంతం పెరిగిపోవచ్చు. కాబట్టి బంగారం కొనే ప్లానింగ్‌లో ఉన్న వారు వెంటనే కొనుగోలు చేయడం ఉత్తమం.
హైదరాబాద్: బంగారం (Gold) కొనే ఆలోచనలో ఉన్న వాళ్లకు ఇదే మంచి తరుణం. ఎందుకంటే గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Gold price) మెల్లమెల్లగా తగ్గుతూ వస్తున్నాయి. మళ్లీ ఏ క్షణమైనా అమాంతం పెరిగిపోవచ్చు. కాబట్టి బంగారం కొనే ప్లానింగ్‌లో ఉన్న వారు వెంటనే కొనుగోలు చేయడం ఉత్తమం. ధరలు పెరిగే లోపు వెంటనే బంగారం కొంటే ప్రయోజనం పొందవచ్చు. బంగారం ధరల బాటలోనే వెండి (Silver) ధరలు కూడా పయనిస్తోంది. వెండి ధరలు కూడా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడంవల్ల ఆ ప్రభావం దేశీ మార్కెట్‌పై కూడా పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా బంగారం ధరలు నేల చూపులు చూస్తున్నాయి. మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర గత మూడు రోజుల కాలంలో భారీగానే తగ్గింది. మూడు రోజుల్లో రూ.430 మేర దిగి వచ్చింది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారట్ గోల్డ్ రేటు రూ.59,890 వద్ద ఉంది.
అదేవిధంగా 22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ రేటు కూడా గత మూడు రోజుల్లో దాదాపు రూ.400 మేర తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారట్ బంగారం ధర రూ.54,900గా ఉంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే.. గత మూడు రోజుల్లో వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కిలో వెండి ధర ఏకంగా రూ.2,500 పతనమైంది. వెండి కొనే వారికి ఇది శుభవార్త. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.77,500 వద్ద ఉంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

