నిజామాబాద్‌కు గ్లోబల్ లాజిక్
నిజామాబాద్ ఐటీహబ్‌కు అంతర్జాతీయ స్థాయి సంస్థలు తరలివస్తున్నాయి. తాజాగా హిటాచి గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్ తన శాఖను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
- కంపెనీ ఏర్పాటుకు హిటాచి సబ్సిడరీ సంస్థ నిర్ణయం
- భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు వస్తాయి: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ ఐటీహబ్‌కు అంతర్జాతీయ స్థాయి సంస్థలు తరలివస్తున్నాయి. తాజాగా హిటాచి గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్ తన శాఖను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న గ్లోబల్ లాజిక్ సంస్థకు హైదరాబాద్‌లో ఇప్పటికే రెండు క్యాంపస్‌లు ఉన్నాయి. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ క్యాంపస్‌లో ప్రస్తుతం దాదాపు 3,000 మంది పనిచేస్తున్నారు. నిజామాబాద్ ఐటీ హబ్‌లో కంపెనీ ఏర్పాటు అంశంపై ఈ నెల మొదటి వారంలో ఆ సంస్థ ప్రతినిధులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి చర్చలు జరిపారు. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని ఆమె ఇచ్చిన హామీ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు నిజామాబాద్ ఐటీ హబ్‌ను ఇటీవల సందర్శించారు. ఈ నేపథ్యంలో కంపెనీ ఏర్పాటుకు కాలిఫోర్నియాలోని ప్రధాన కార్యాలయం అనుమతులు ఇచ్చింది.
హర్షంవ్యక్తం చేసిన మహేశ్ బిగాల
పెద్దనగరాలకు సమానంగా స్థానికులకు అవకాశాలు కల్పించేందుకే ఐటీ హబ్‌ను నిజామాబాద్‌లో ఏర్పాటు చేయడం హర్షణీయమని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల ప్రారంభమైన ఐటీ హబ్‌లో కంపెనీలను ఏర్పాటు చేయడానికి ప్రముఖ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయని, తాజాగా అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచి గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్ తన కంపెనీని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం పట్ల మహేశ్ బిగాల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా నిజామాబాద్‌కి గ్లోబల్ లాజిక్ ఏర్పాటు చేసే విషయములో పలు సార్లు సంస్థతో సంప్రదించి.. త్వరితగతిన ఏర్పాటుకు మార్గం సులువు చేసిన నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ధన్యవాదాలు తెలిపారు. ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ స్థానికులకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో వివిధ జిల్లాలలో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా సహకరిస్తున్న ఐటీ మంత్రి కేటీఆర్‌కి, ఇకడే వివిధ సంస్థలను ఏర్పాటు చేసేందుకు విదేశీ ప్రతినిధులు రావడానికి సహకరించిన ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
శుభపరిణామం: ఎమ్మెల్సీ కవిత
అంతర్జాతీయ సంస్థ గ్లోబల్ లాజిక్ నిజామాబాద్‌లో కంపెనీ ఏర్పాటు చేయడం శుభ పరిణామం అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఐటీహబ్‌ను ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే అపూర్వ స్పందన వస్తున్నదని చెప్పారు. ఇప్పటికే అనేకమందికి ఉద్యోగాలు లభించాయని, రెండుసార్లు జాబ్‌మేళాలు నిర్వహించామని వివరించారు. గ్లోబల్ లాజిక్ కంపెనీ ఏర్పాటుతో స్థానిక యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని తెలిపారు. నిజామాబాద్ ఐటీహబ్‌ను భవిష్యత్తులో మరింత విస్తరిస్తామని, మరిన్ని ప్రముఖ కంపెనీలు వస్తాయని పేర్కొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

