గూగుల్ టాక్స్ విధానానికి చెక్.. మినిమమ్ టాక్స్‌కు ఇండియా ఓకే!
గూగుల్ టాక్స్ విధానానికి చెక్.. మినిమమ్ టాక్స్‌కు ఇండియా ఓకే! ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ కార్పొరేట్ టాక్స్ కనిష్ట స్థాయికి చేర్చాలని భారత్, చైనా,..

న్యూఢిల్లీ: గ్లోబల్ కార్పొరేట్ టాక్స్ కనీసం15 శాతం విధించాలన్న ప్రతిపాదనకు భారత్, చైనా, స్విట్జర్లాండ్‌తో సహా ప్రపంచంలోని 130 దేశాలు మద్దతు పలికాయి. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) సమావేశంలో అమెరికా ఆర్థిక మంత్రి జానెత్ అల్లెన్ ఈ ప్రకటన చేశారు. దీనివల్ల ప్రతిఏటా అదనపు 150 బిలియన్ల డాలర్ల పన్నులు ప్రపంచ దేశాలు పొందుతాయని అంచనా.
ఇంటర్నేషనల్ టాక్స్ రూల్స్‌లో సంస్కరణలు తేవాలన్న ప్రణాళికలో 130 దేశాలు చేరాయని ఓఈసీడీ ప్రకటించింది. దీని ప్రకారం బహుళ జాతి సంస్థలు (ఎంఎన్సీ)లు బిజినెస్ చేసిన దేశాల్లో సరైన కార్పొరేట్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
ఓఈసీడీలో సభ్యత్వం గల 130 దేశాలు గ్లోబల్ జీడీపీలో 90 శాతానికి పై చిలుకు. గ్లోబల్ కార్పొరేట్ టాక్స్ విధానంపై జీ-20 దేశాల కూటమి రూపొందించిన ముసాయిదాకు ఓఈసీడీలోని 130 దేశాలు ఆమోదముద్ర తెలిపాయి.
అక్టోబర్ నాటికి ఇంటర్నేషనల్ టాక్స్ రూల్ అమలులోకి వస్తుందని అంచనా. ఇంటర్నేషనల్ టాక్స్ సిస్టమ్‌లో స్థిరత్వం తేవడమే దీని లక్ష్యాల్లో ఒకటి.
గ్లోబల్ కార్పొరేట్ టాక్స్ విధానం రూపకల్పనలో రెండు అంశాలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశంలోనైనా బిజినెస్ చేయడానికి సాధికారత కల్పిస్తుందీ సిస్టమ్. మల్టీ నేసనల్ కంపెనీలపై సరైన పన్ను విధించేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. ఆ కంపెనీ సొంత దేశం, ఆ కంపెనీ బిజినెస్ చేసే దేశం మధ్య పన్నులు వసూలు చేయడానికి కొన్ని హక్కులు కల్పిస్తాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- corporate tax
- google tax
- oecd
RELATED ARTICLES
తాజా వార్తలు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

