Abroad Education | విదేశీ విద్యాభ్యాసం.. నిధుల సమీకరణపై నిపుణులేమంటారు?!
Abroad Education | విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి బ్యాంకుల్లో విద్యా రుణాలే మార్గం అని నిపుణులు చెబుతున్నారు.
Abroad Education | ప్రవీణ్ ప్రకాశ్ (23) హైదరాబాద్ వాసి.. స్కూల్ ఎడ్యుకేషన్ రోజుల నుంచి కెనడాకు వెళ్లాలని ఆశలు పెట్టుకున్నారు. కెనడాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయాలని సంకల్పించారు. ఆయన కలలు సాకారం చేసుకోవడానికి కొన్ని చర్యలు అవసరం.. ప్రధానంగా విదేశాల్లో విద్యాభ్యాసానికి అవసరమైన నిధులు సమీకరించుకోవడం ప్రధాన సమస్యగా పరిణమించింది. ప్రవీణ్ ప్రకాశ్ ఒక్కరే కాదు.. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలని కలలు కన్న, కంటున్న భారతీయ విద్యార్థుల జాబితా చాలా పెద్దగానే ఉంటది. కానీ, వారి కల నెరవేర్చుకోవడానికి అవసరమైన నిధుల సేకరణే ప్రధాన సవాల్‌గా పరిణమించింది. కనుక విదేశీ విద్యనభ్యసించాలని కోరికలు ఉన్న వారు తమకు అవసరమైన నిధులను సేకరించడానికి ముందుగానే ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇందుకు తీసుకోవాల్సిన చర్యలేంటో ముందుగా తెలుసుకుందాం..
విదేశీ విద్యా రుణాలకు ఇలా
విదేశీ విద్యకు వెళ్లాలని కోరుకునే వారిలో అత్యధికులకు సౌకర్యవంతమైన రూట్ ఎడ్యుకేషన్ లోన్. ఏదేనీ యూనివర్సిటీలో సీటు అడ్మిషన్ లభించినట్లు తుది లేఖ రాగానే రుణ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాలి. వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇచ్చే రుణాల వివరాలు తెలుసుకుని వాటి యాజమాన్యాలను, అధికారులను సంప్రదించాలి. ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, జీవన ఖర్చులు, రవాణా తదితర ఖర్చులను కలుపుతూ సెక్యూర్డ్ లేదా అన్ సెక్యూర్డ్ రుణాలు అందుబాటులో ఉన్నాయి. విదేశాల్లో ఉన్నత విద్యా కోర్సులు పూర్తయ్యాక రుణ చెల్లింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఎటువంటి రుణం అవసరం, ఆ రుణానికి ఎంత వడ్డీరేటు అవసరం అన్న విషయాలపై అటెన్షన్ ఉండాలి.
విద్యా రుణాలతోనే విదేశాలకు..
మెజారిటీ విద్యార్థులు విదేశీ విద్యాభ్యాసం కోసం అవసరమైన ఖర్చులకు ఎడ్యుకేషన్ లోన్లు తీసుకుని వెళతారని గ్యాన్‌ధన్ కో ఫౌండర్ అండ్ సీఈవో అంకిత్ మెహతా చెప్పారు. వ్యక్తిగత నిధుల లభ్యత లేని వారికి ఎడ్యుకేషన్ లోన్లతో పలు పన్ను రాయితీలు, బెనిఫిట్లు ఉన్నాయి. ఎడ్యుకేషన్ లోన్లపై టీసీఎస్ 0.5 శాతం మినహాయింపు పొందొచ్చు. ఒక ఏడాదిలో రూ.7 లక్షల పై చిలుకు పర్సనల్ లావాదేవీలపై 5% టీసీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. కానీ, రుణ గ్రహీతలు ఆదాయం పన్ను చట్టం 80ఈ సెక్షన్ కింద పన్ను మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు.
రుణ దరఖాస్తు చెక్ చేయాలి ఇలా
లోన్ అప్లికెంట్, గ్యారంటర్ సమర్పించే పత్రాలు, ఫైనాన్సియల్ ప్రొఫైల్‌ను డిటైల్‌గా అనలైజ్ చేయడం బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, బ్యాంకేతర ఆర్థిక సంస్థల నుంచి ఎడ్యుకేషన్ లోన్లు వస్తాయి. విదేశీ విద్యను అభ్యసించే వారికి, అభ్యసించాలని భావించే వారికి స్కాలర్షిప్లు అందుబాటులో ఉన్నాయి. యూనివర్సిటీలు ఇన్‌హౌజ్ స్కాలర్షిప్లు ఆఫర్ చేశాయి. చెవెనింగ్, కామన్వెల్త్ స్కాలర్షిప్లు ఉన్నాయి. మెరిట్ బేస్డ్, స్పోర్ట్స్, యూనివర్సిటీ స్కాలర్షిప్లు, ప్రభుత్వ స్కాలర్షిప్లు, ఇతర ఆప్షన్లు విదేశీ విద్యాభ్యాసానికి వెళ్లే వారి కోసం సిద్ధంగా ఉన్నాయి.
సెల్ఫ్ ఫండ్స్‌తో విద్యాభ్యాసం పూర్తి బెస్ట్
బ్యాంకుల్లో విద్యా రుణాలు తీసుకోవడానికి బదులు తల్లిదండ్రులు సిద్ధం చేసిన సెల్ఫ్ ఫండ్‌ను ఉపయోగించుకుని విద్యాభ్యాసం పూర్తి చేయాలని సూచిస్తున్నారు. పిల్లల ఉన్నత విద్య కోసం కొన్నేండ్లు తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి దాచిపెట్టిన వ్యక్తిగత సొమ్మును వాడుకోవచ్చునని అంకిత్ మెహతా చెప్పారు. కానీ, వ్యక్తిగత నిధులు తక్కువగా ఉంటాయని, ఎడ్యుకేషన్ ఖర్చులు పెరిగిపోవడంతో వ్యక్తిగతంగా నిధులు సమకూర్చినా విదేశీ విద్యాభ్యాసానికి సరిపోవు. నిధుల వనరులను స్మార్ట్‌గా వాడుకోవాలని అంకిత్ మెహతా తెలిపారు.
వ్యక్తిగత నిధులు ఇలా వాడుకోవాలి
వ్యక్తిగత నిధులను జీఆర్ఈ, ఐఈఎల్టీఎస్ టెస్ట్ ఫీజులు, వీసా ఖర్చులు, అప్లికేషన్ ఫీజు తదితర ఖర్చుల కోసం వాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ద్రవ్యోల్బణం, రూపాయి పతనం, వడ్డీరేట్ల పెంపు వంటి అత్యవసర పరిస్థితుల్లో వ్యక్తిగత నిధుల బఫర్ స్టాక్స్ సరిపోవు. పార్ట్‌టైం జాబ్స్ చేయడంతో మద్దతు సంపాదించుకోవచ్చు. నిధులను సమకూర్చుకోవడానికి, బడ్జెటింగ్‌కు టెక్ విద్యార్థులకు పాఠాల బోధన వంటి పార్ట్‌టైం జాబ్స్ వంటివి ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

