గూగుల్లోకి భానుమూర్తి
గూగుల్లోకి భానుమూర్తి.. | వరంగల్ నీట్ పూర్వవిద్యార్థి, సీనియర్ ఐటీ నిపుణులు భానుమూర్తి బల్లాపురం.. గూగుల్ క్లౌడ్ జపాన్, ఆసియా-పసిఫిక్ (జేఏపీఏసీ) .....

క్లౌడ్ జేఏపీఏసీ ఉపాధ్యక్షుడిగా నియమితులైన వరంగల్ నీట్ పూర్వవిద్యార్థి
న్యూఢిల్లీ, ఆగస్టు 17: వరంగల్ నీట్ పూర్వవిద్యార్థి, సీనియర్ ఐటీ నిపుణులు భానుమూర్తి బల్లాపురం.. గూగుల్ క్లౌడ్ జపాన్, ఆసియా-పసిఫిక్ (జేఏపీఏసీ) కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. గతంలో ఈయన విప్రో అధ్యక్షుడు, సీవోవో గానూ పనిచేసిన విషయం తెలిసిందే.
అక్కడే ఈ ఏడాది జూలైలో రిటైర్ అయ్యారు. ఈ క్రమంలోనే ఇప్పుడు గూగుల్ క్లౌడ్ లీడర్షిప్ టీంలో చేరారు. అమెరికాలోని గూగుల్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఉపాధ్యక్షుడు జాన్ జేస్టర్కు భానుమూర్తి రిపోర్ట్ చేస్తారని సంస్థ ఓ ప్రకటనలో తెలియజేసింది.
ఐఐఎం అహ్మదాబాద్‌లోనూ విద్యనభ్యసించిన భానుమూర్తికి ఐటీ రంగంలో 25 ఏండ్లకుపైగా అనుభవం ఉన్నది. ఎన్నో సంస్థల్లో సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిల్లో పనిచేశారు. గ్లోబల్ ఫార్చూన్ 500 కస్టమర్స్కూ సేవలందించారు. ‘మా ప్రాంతీయ నాయకత్వంలో భానుమూర్తి భాగస్వామి కానున్నారు. భానుమూర్తి రాకతో మార్కెట్లో సంస్థ ప్రతిష్ఠ మరింత ఇనుమడిస్తుందని ఆశిస్తున్నాం’ అని గూగుల్ క్లౌడ్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- bhanumurthy
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

