Chris Williams | టెక్ రంగంలో లేఆఫ్స్.. ఎవరికి ఎక్కువ రిస్క్ అంటే..!
Chris Williams | టెక్ (tech) రంగంలో లేఆఫ్స్ (layoffs) పర్వం కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో మైక్రోసాఫ్ట్‌లోని హెచ్ఆర్ విభాగం మాజీ ఉపాధ్యక్షుడు (Vice President of Human Resources at Microsoft) క్రిస్ విలియమ్స్ (Chris Williams) రాసిన ఓ కథనం (article) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. లేఆఫ్స్ ప్రభావం ఎక్కువగా ఎవరికి ఉందన్నది ఆ ఆర్టికల్ ముఖ్య సారాంశం.
Chris Williams | టెక్ (tech) రంగంలో లేఆఫ్స్ (layoffs) పర్వం కొనసాగుతోంది. పలు కారణాలతో గూగుల్ (Google) , మైక్రోసాఫ్ట్ (Microsoft), అమెజాన్ (Amazon), ట్విట్టర్ (Twitter), లింక్డిన్ (LinkedIn), మెటా (Meta) వంటి టెక్ దిగ్గజాలు (tech Companies) ఒకదాని తర్వాత ఒకటి సంస్థలోని ఉద్యోగులను ఇప్పటికే తొలగించాయి. పలు కంపెనీలు ఇంకా లేఆఫ్స్ కొనసాగిస్తు్న్నాయి. కాగా, ఈ తొలగింపు పర్వంతో టెక్ ఉద్యోగులు (Tech employees) తమ ఉద్యోగ భద్రతపై ( job security) తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి తరుణంలో మైక్రోసాఫ్ట్‌లోని హెచ్ఆర్ విభాగం మాజీ ఉపాధ్యక్షుడు (Vice President of Human Resources at Microsoft) క్రిస్ విలియమ్స్ (Chris Williams) రాసిన ఓ కథనం (article) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. లేఆఫ్స్ ప్రభావం ఎక్కువగా ఎవరికి ఉందన్నది ఆ ఆర్టికల్ ముఖ్య సారాంశం.
క్రిస్ కథనం (Chris Article) ప్రకారం.. ఈవెంట్ ప్లానింగ్ టీమ్ (event planning team), కొత్త ఇనిషియేటివ్స్ టీమ్ ( new initiatives team), కాంట్రాక్ట్ వర్కర్స్ (contract workers ) ఈ మూడు రకాల ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. కంపెనీల్లో ఎక్కువ రిస్క్ ఉండేది కాంట్రాక్ట్ ఉద్యోగులపైనే అని ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే.. అనుకోని పరిస్థితుల్లో కంపెనీలు కాంట్రాక్టు కార్మికులను వెసులుబాటు కోసం నియమించుకుంటాయని.. అయితే కంపెనీ కష్టకాలంలో ఉన్నప్పుడు మొదటగా తొలగించేది కాంట్రాక్ట్ ఉద్యోగులనేనని వివరించారు.
తర్వాత కంపెనీల్లోని ఈవెంట్ ప్లానింగ్ విభాగం (event planning team)తోపాటు సంబంధిత ఇతర డిపార్ట్మెంట్లలోని ఉద్యోగులూ జాబ్స్ కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు. కంపెనీలు మాంద్యం సమయంలో ఉద్యోగులకు టూర్లు, ఇతర సదుపాయాలను కల్పించని కారణంగా తమ ఖర్చులను తగ్గించుకుంటాయి. అలాంటి సమయంలో ఈవెంట్ ప్లానింగ్ సిబ్బంది అవసరం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. వీరితోపాటు కంపెనీలో కొత్తగా చేరిన ఉద్యోగుల (new initiatives team)పై కూడా లేఆఫ్స్ ప్రభావం ఉంటుందని క్రిస్ తన కథనంలో వివరించారు.
ఇదే సందర్భంలో కంపెనీలో రిస్క్‌లేని ( safe) ఉద్యోగాలను కూడా క్రిస్ (Chris Williams) ప్రస్తావించారు. సంస్థలకు నేరుగా లాభాలు తెచ్చిపెట్టే కీలకమైన విభాగాల్లోని ఉద్యోగుల ఉద్యోగాలు సేఫ్ ( safe) అని చెప్పారు. వారిని తొలగించే అవకాశం తక్కువగా ఉంటుందన్నారు. మానవవనరులు (హెచ్ఆర్) (human resources), ఫైనాన్స్ ( finance) విభాగాల్లోని ఉద్యోగులపై లేఆఫ్స్ (Layoffs) ప్రభావం చాలా తక్కువగా ఉంటుందన్నారు. ఆయా విభాగాల్లో సిబ్బంది సహజంగానే పరిమితంగా ఉంటారు కాబట్టి అక్కడ కోతలకు ఆస్కారం తక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ వారిని తొలగించాల్సి వస్తే మాత్రం కంపెనీలు ఆచితూచి అడుగులు వేస్తాయని క్రిస్ తన కథనంలో వివరించారు.
Also Read..
Maharashtra | దారుణం.. యూట్యూబ్ చూసి డెలివరీ చేసుకున్న 15 ఏండ్ల బాలిక.. శిశువును చంపి..!
Jennifer Gates | తాత అయిన బిల్‌గేట్స్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జెన్నిఫర్
Imran Khan | ఇమ్రాన్‌కు పాకిచ్చిన పాక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

