హైదరాబాద్, అక్టోబర్ 4: రాబోయే పండుగ సీజన్లో షాపింగ్ చేసే రిటైలర్ల కోసం అజియో బిజినెస్.. భారతీయ అతిపెద్ద ఫ్యాషన్ మేళా (ఐఎల్ఎఫ్ఎం)ను ఆవిష్కరించింది. ఈ 10వ ఎడిషన్‌లో ప్రత్యేకమైన బ్రాండ్లు, 500లకుపైగా కలెక్షన్లు, లక్షకుపైగా సరికొత్త ైస్టెల్స్ ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తాయని బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో సంస్థ తెలిపింది.
అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఈ భారీ ఫ్యాషన్ మేళాను నిర్వహిస్తున్నామన్న అజియో.. రిటైలర్లు తమతమ ప్రాంతాల నుంచే అజియో బిజినెస్ యాప్‌లో షాపింగ్ చేయవచ్చన్నది. ఈ నెల 21దాకా మేళా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నది. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా, ఎర్లీ బర్డ్ ఆఫర్లు, డైలీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, రివైజ్డ్ రిటర్న్-క్రెడిట్ పాలసీలు ఉంటాయి.