రూ.5.6 లక్షల కోట్లు ఆవిరి
విదేశీ మారకం నిల్వలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. 2021లో రికార్డు స్థాయికి చేరుకున్న నిల్వలు ఈ మరుసటి ఏడాది చివరినాటికి లక్షల కోట్ల స్థాయిలో కనుమరుగయ్యాయి. 2021 అక్టోబర్‌లో రికార్డు స్థాయి 645 బిలియన్ డాలర్లకు చేరుకున్న నిల్వలు..అదే ఏడాది చివరినాటికి 632.1 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.
- నిరుడు కరిగిన ఫారెక్స్ నిల్వలు
న్యూఢిల్లీ, జనవరి 7: విదేశీ మారకం నిల్వలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. 2021లో రికార్డు స్థాయికి చేరుకున్న నిల్వలు ఈ మరుసటి ఏడాది చివరినాటికి లక్షల కోట్ల స్థాయిలో కనుమరుగయ్యాయి. 2021 అక్టోబర్‌లో రికార్డు స్థాయి 645 బిలియన్ డాలర్లకు చేరుకున్న నిల్వలు..అదే ఏడాది చివరినాటికి 632.1 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇదే క్రమంలో 2022 డిసెంబర్ చివరినాటికి 562.85 బిలియన్ డాలర్లకు పతనమయ్యాయి. అంటే గత ఏడాదికాలంలో 70.1 బిలియన్ డాలర్లు తగ్గాయి.
మన కరెన్సీలో ఇది రూ.5.6 లక్షల కోట్లు. రిజర్వు బ్యాంక్ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. డిసెంబర్ 30తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 44 మిలియన్ డాలర్లు పెరిగి 562.85 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. రూపాయి పతనాన్ని కట్టడి చేయడంలో రిజర్వు బ్యాంక్ పూర్తిగా విఫలమయ్యింది. దీంతో విదేశీ మారకం నిల్వలు కరిగిపోవడానికి కూడా ఇది ప్రధాన కారణం. రుపీని కట్టడి చేయడానికి గతేడాది సెప్టెంబర్‌లో ఆర్బీఐ 33.42 బిలియన్ డాలర్ల విలువైన ఫారెక్స్ రిజర్వులను సైతం విక్రయించింది. అయినప్పటికీ గానీ రూపాయి పతనం ఆగలేదు. పాతాళంలోకి పడిపోయింది.
- 354 మిలియన్ డాలర్లు పెరిగిన బంగారం నిల్వలు 41.32 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
- విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 302 మిలియన్ డాలర్లు కరిగిపోయి 498.19 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
- 2022లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 12 శాతం తగ్గి 82.85కి జారుకున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

