Ford Motor | ఫోర్డ్ ‘యూ’టర్న్.. ఎండీవర్‌తో భారత్ మార్కెట్లోకి రీఎంట్రీ..?!
Ford Motor | భారత్ నుంచి నిష్క్రమించిన అమెరికా కార్ల తయారీ సంస్థ ‘ఫోర్డ్ మోటార్’.. యూ టర్న్ తీసుకున్నది. తిరిగి భారత్ మార్కెట్లోకి తన ప్రీమియం ఎస్యూవీ థర్డ్ జనరేషన్ ‘ఎండీవర్’తో రీ ఎంట్రీ ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం.
Ford Motor | రెండేండ్ల క్రితం భారత్‌లో కార్ల ఉత్పత్తిని నిలిపేసిన అమెరికా కార్ల తయారీ సంస్థ ‘ఫోర్డ్ మోటార్’ తన నిర్ణయాన్ని పున: పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. త్వరలో భారత్‌లో కార్ల తయారీ ప్రారంభించడానికి సిద్ధమవుతున్నదని వార్తాకథనాలు వచ్చాయి. రెండేండ్ల క్రితం భారత్‌లో కార్ల ఉత్పత్తి నిలిపేసిన ఫోర్డ్ మోటార్.. చెన్నై సమీప మారైమలే నగర్‌లోని ప్రొడక్షన్ యూనిట్ విక్రయానికి పలు ఆటోమొబైల్ సంస్థలతో సంప్రదింపులు నిర్వహించింది. కానీ, చెన్నై ప్లాంట్ విక్రయించాలన్న ఆలోచన నుంచి ఫోర్డ్ మోటార్ వెనక్కు తగ్గినట్లు తెలిసింది. ఆ ప్లాంట్ విక్రయానికంటే తిరిగి కార్ల ఉత్పత్తి ప్రారంభించడం మేలనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.
భారత్‌లో ప్రస్తుతం ఎస్యూవీ కార్లకు బోల్డు గిరాకీ ఉంది. రీ ఎంట్రీలో భాగంగా భారత్ మార్కెట్లో తన ప్రీమియం ఎస్యూవీ థర్డ్ జనరేషన్ ‘ఎండీవర్ (Ford Endeavour)` ఆవిష్కరించాలని ఫోర్డ్ మోటార్ యోచిస్తున్నట్లు సమాచారం. భారత్ మార్కెట్లో సీబీయూ / సీకేడీ మోడల్ కార్లను విక్రయిస్తుందని భావిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్లో విస్తరణకు చెన్నై ప్రొడక్షన్ యూనిట్లో ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్రణాళికను ఉపసంహరించుకున్నది.
అయితే ఇటీవల ఫోర్డ్ మోటార్ సీఓఓగా భారత్ సంతతికి చెందిన కుమార్ గల్హోత్రా బాధ్యతలను స్వీకరించడంతో ఆ కంపెనీ భారత్ మార్కెట్లోకి రీ ఎంట్రీ చేయనున్నదన్న చర్చలు, ఊహాగానాలు ప్రారంభం అయ్యాయి. 1996లో భారత్‌లో తన ఎస్కార్ట్ కారుతో కార్ల ఉత్పత్తి, విక్రయాలు ప్రారంభించింది ఫోర్డ్ మోటార్ ఇండియా. అటుపై ఐకాన్, ఫిగో, ఎకో స్పోర్ట్, ఎండీవర్ మోడల్ కార్లను ఆవిష్కరించింది. తమిళనాడు రాజధాని చెన్నై, గుజరాత్ రాష్ట్రాల్లో ఫోర్డ్ మోటార్’కు ప్రొడక్షన్ యూనిట్లు ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి : బీవీ రాఘవులు
Gandra Venkata Ramana Reddy | ప్రతీ గ్రాడ్యుయేట్‌కు ఓటర్ నమోదుపై అవగాహన కల్పించాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
చందంపల్లి పంచాయతీ కార్యదర్శిగా కే ఎన్.చారి బాధ్యతల స్వీకరణ
Daler Mehndi | దలేర్ మెహందీ వివాదంపై పీఎం మోదీకి FWICE లేఖ.. కళాకారుల పట్ల సంయమనం పాటించాలని విజ్ఞప్తి!
Sheetal Devi: ఆర్చరీలో శీతల్ దేవి అద్భుతం.. పారా గేమ్స్‌లో రెండో స్వర్ణం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

