Flipkart Mega Saving Days sale : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మెగా సేవింగ్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్ 15, పిక్సెల్ 8 సహా పలు ప్రీమియం స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయ ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. మెగా సేవింగ్ డేస్ సేల్ ఏప్రిల్ 15 వరకూ కొనసాగుతుంది. ఈ సేల్‌లో ఐఫోన్ 15పై ఏకంగా రూ. 10,000 ఆఫర్ అందుబాటులో ఉంది.
మొటొరొలా ఎడ్జ్ 40 నియో, ఐఫోన్ 13, పిక్సెల్ 8 వంటి పలు స్మార్ట్ఫోన్లు తగ్గింపు ధరకు లభిస్తున్నాయి. ఐఫోన్ 15 కేవలం రూ. 65,999కి సేల్‌లో లిస్టయింది. దీంతో ఫ్లిప్‌కార్ట్‌పై వినియోగదారులు ఏకంగా రూ. 13,901 ఫ్లాట్ డిస్కౌంట్ పొందనున్నారు. ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో డ్రీమ్ ఫోన్‌ను మరింత తక్కువ ధరకే కస్టమర్లు సొంతం చేసుకునే వెసులుబాటు ఉంది.
ఇక ఐఫోన్ 13 సేల్ పీరియడ్‌లో రూ . 52,999కి లభిస్తోంది. పిక్సెల్ 8 ఒరిజినల్ ధర రూ. 75,999 కాగా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కేవలం రూ. 69,999కి అందుబాటులో ఉంది. మొటొరొలా ఎడ్జ్ 40 నియో రూ. 22,999కి లభించనుండగా, కొన్ని బ్యాంక్ ఆఫర్స్‌లో అదనంగా రూ. 2000 డిస్కౌంట్ లభిస్తోంది. పోకో ఎం6 ప్రొ రూ. 9999, శాంసంగ్ గెలాక్సీ ఎప్14 5జీ రూ. 12,490కే సేల్‌లో అందుబాటులో ఉన్నాయి.
Read More :
Congress | మజ్లిస్, కాంగ్రెస్ మధ్య అవగాహన! రాష్ట్రవ్యాప్తంగా పరస్పర సహకారం