Flipkart Big Saving Days Sale | ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్.. తన యూజర్ల కోసం మరో బిగ్ సేవింగ్ డేస్ సేల్స్ ప్రకటించింది. ఈ నెల 15 నుంచి 19 వరకు ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆపిల్ ఐ-ఫోన్ 14పై భారీ డిస్కౌంట్ అందిస్తున్నది.
ఐఫోన్-14 విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.70,999లకే అందిస్తున్నది. ఈ ఫోన్ అసలు ధర రూ.79,900. గత మేనెలలో తీసుకొచ్చిన బిగ్ సేవింగ్ డేస్ సేల్స్ లో ఐ-ఫోన్ 14పై ఫ్లిప్ కార్ట్ రూ.12 వేల డిస్కౌంట్ అందించింది. ఐ-ఫోన్14 తోపాటు ఐఫోన్-13 ఫోన్లు కూడా డిస్కౌంట్ ధరపై లభిస్తాయి.
వీటితోపాటు హోం అప్లియెన్సెస్, కిచెన్ వేర్ వస్తువులపై గణనీయ డిస్కౌంట్లు లభిస్తాయి. వాషింగ్ మిషన్లు, హోం ప్యూరిఫయర్లు, ఎయిర్ ప్రెయర్స్ మీద 50 శాతం డిస్కౌంట్ అందిస్తున్నది. బెడ్ షీట్లు, పిల్లో కవర్లపై 40 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తాయి.