Axis Bank Fixed deposit alert | తన బ్యాంకులో డిపాజిటర్లు చేసే ఫిక్స్డ్ డిపాజిట్ల రేట్లను ప్రైవేట్ బ్యాంకు యాక్సిస్ బ్యాంక్ సవరించింది. ఏడు రోజుల నుంచి 10 ఏండ్ల గడువు లోపు డిపాజిట్లకు ఈ వడ్డీరేట్లు వర్తిస్తాయి. గత మార్చి 18 నుంచి ఈ వడ్డీరేట్లు అమలులోకి వస్తాయి. రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు ఈ వడ్డీరేట్లు వర్తిస్తాయి. చివరిసారిగా గత మే నెలలో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీని సవరించింది.
ఏడు రోజుల నుంచి 29 రోజుల టైం గల ఫిక్స్డ్ డిపాజిట్లపై అతి తక్కువగా 2.5 శాతం, 5-10 ఏండ్ల లోపు గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 5.75 శాతం వడ్డీరేటు ఆఫర్ చేస్తుంది. ఇక సీనియర్ సిటిజన్లకు 2.5 శాతం (ఏడు రోజులు) నుంచి 6.50 శాతం (10 ఏండ్లు) వడ్డీ ఆఫర్ చేస్తున్నది యాక్సిస్ బ్యాంక్.
తాజాగా యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు ఇలా..
గడువు- వడ్డీరేటు:
7-29 రోజులు- 2.50%
30 రోజుల నుంచి 3 నెలలు-3%
3 నెలల నుంచి 6 నెలలు- 3.5%
6 నెలల నుంచి 11 నెలల 25 రోజులు- 4.40%
11 నెలల 25 రోజుల నుంచి 18 నెలలు- 5.10%,
18 నెలల నుంచి రెండేండ్లు- 5.25%
రెండేండ్ల నుంచి 30 నెలలు- 5.50%
మూడేండ్ల నుంచి ఐదేండ్లు – 5.40%
ఐదేండ్ల నుంచి పదేండ్ల వరకు-5.75%