Force Gurkha | జూన్‌లో ఫోర్స్ ఎస్ యూవీ 5-డోర్ గుర్ఖా లాంచింగ్.. ఇవీ డిటైల్స్..!
Force Gurkha | ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్స్ మోటార్స్ తన 5-డోర్ వర్షన్ గుర్ఖా ఎస్యూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది.
Force Gurkha | ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్స్ మోటార్స్ తన 5-డోర్ వర్షన్ గుర్ఖా ఎస్యూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. 2022 నుంచి ఫోర్స్ మోటార్స్ తన ఎస్ యూవీ 5-డోర్ గుర్ఖా తయారీపై ఫోకస్ చేస్తున్నది. 3-డోర్ వర్షన్ తో 425 ఎంఎం లాంగర్ వీల్ బేస్ కలిగి ఉంటుంది. వచ్చే జూన్ లో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నదని తెలుస్తున్నది. ఫోర్స్ గుర్ఖా 5-డోర్ కారు ధర రూ.16 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుందని భావిస్తున్నారు. 3-డోర్ గుర్ఖా కారు ధర ప్రస్తుతం రూ.5.10 లక్షల (ఎక్స్ షోరూమ్)కు లభిస్తుంది. మహీంద్రా థార్ 5-డోర్, మారుతి జిమ్నీ కార్లకు 5-డోర్ ఫోర్స్ గుర్ఖా గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.

3-డోర్ గుర్ఖా మాదిరిగానే ఉన్నా 5-డోర్ గుర్ఖా మోడల్ కారులో కొన్ని మార్పులు చేశారు. న్యూ స్క్వేర్ షేప్డ్ హెడ్ ల్యాంప్ యూనిట్స్ విత్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, సిగ్నేచర్ టూ స్లాట్ గ్రిల్లె ఉంటాయి. 18-అంగుళాల డైమండ్ కట్ డ్యుయల్ టోన్ అల్లాయ్ వీల్స్, 3-డోర్ గుర్ఖాలో మాదిరిగా 16-అంగుళాల వీల్స్ కంటే 2-ఎక్స్ ట్రా రేర్ డోర్స్, ఫ్రంట్ అండ్ రేర్‌లో న్యూ బంపర్లు, టెయిల్ గేట్ మౌంటెడ్ స్పేర్ వీల్, లాడర్, స్నూర్ కెల్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఇంటీరియర్‌గా డార్క్ గ్రే కలర్ క్యాబిన్ థీమ్, లాంగ్ వీల్ బేస్, డాష్ బోర్డుపై 7-అంగుళాల టచ్ స్క్రీన్ సిస్టమ్, ఫ్రంట్ అండ్ రేర్ (సెకండ్ రో) పవర్ విండోస్, మల్టీపుల్ వెంట్స్ తోపాటు మాన్యువల్ ఏసీ, డ్యుయల్ ఎయిర్ బ్యాగ్స్, రివర్స్ కెమెరా, రేర్ పార్కింగ్ సెన్సర్ వంటి సేఫ్టీ ఫీచర్లు జత చేశారు.
ఫోర్స్ 5-డోర్ గుర్ఖా 2.6 లీటర్ల డీజిల్ ఇంజిన్ తో వస్తుంది. ఈ ఇంజిన్ 90 పీఎస్ విద్యుత్, 250 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. మెర్సిడెస్ బెంజ్ నుంచి ఈ ఇంజిన్ వినియోగిస్తున్నారు. ఫోర్ వీల్ డ్రైవ్ ట్రైన్ విత్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిసన్, లో రేంజ్ ట్రాన్స్ పర్ కేస్, 5-డోర్ ఫోర్స్ గుర్ఖా డ్రైవర్ సీటు పక్కన సెంట్రల్ కన్సోల్‌పై 4డబ్ల్యూడీ నాబ్ తదితర ఫీచర్లు ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

