SVB-First Citizens | ఫస్ట్ సిటిజన్స్ చేతికి ఎస్వీబీ .. ఇండియన్ స్టార్టప్‌లకు రిలీఫ్ లభించేనా?!
SVB-First Citizens | ఇటీవల సంక్షోభంలో చిక్కుకున్న సిలికాన్ వ్యాలీ బ్యాంకు (ఎస్వీబీ)ని ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్ టేకోవర్ చేసింది.
SVB-First Citizens | ఇటీవల సంక్షోభంలో చిక్కుకున్న సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ)ని ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్ టేకోవర్ చేసింది. ఆర్థికంగా దెబ్బ తిన్న ఎస్వీబీ ఖాతాదారుల డిపాజిట్లు, రుణాలు కూడా ఫస్ట్ సిటిజన్ బ్యాంక్ పరిధిలోకి వెళ్లిపోతాయి. దీని ప్రకారం ఎస్వీబీ డిపాజిటర్లంతా ఆటోమేటిక్‌గా ఫస్ట్ సిటిజన్ బ్యాంక్ డిపాజిటర్లుగా మారతారు. ఎస్వీబీ ఖాతాదారుల డిపాజిట్లకు చట్ట పరిమితిని బట్టి యూఎస్ ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (యూఎస్ ఎఫ్‌డీఐసీ) బీమా వర్తిస్తుంది. ఇప్పటికైతే ఎస్వీబీ బ్యాంకు కార్యకలాపాలను ఎఫ్‌డీఐసీ పర్యవేక్షిస్తుంది. సోమవారం నుంచి ఎస్వీబీ శాఖలు ఫస్ట్ సిటిజన్ బ్యాంక్‌గా ఖాతాదారులకు సేవలందిస్తాయి.
ఈ నెల 10 నాటికి ఎస్వీబీలో సుమారు 167 బిలియన్ డాలర్ల ఆస్తులు, దాదాపు 119 బిలియన్ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయని ఎఫ్‌డీఐసీ తెలిపింది. ఎస్వీబీ-ఫస్ట్ సిటిజన్ బ్యాంక్ మధ్య కుదిరిన కొనుగోలు ఒప్పందం ప్రకారం 72 బిలియన డాలర్లకు ఎస్వీబీని ఫస్ట్ సిటిజన్ బ్యాంక్ టేకోవర్ చేస్తుంది. 16.5 బిలియన్ డాలర్ల డిస్కౌంట్ ధరపై ఎస్వీబీని ఫస్ట్ సిటిజన్ బ్యాంక్ సొంతం చేసుకున్నది. మరో 90 బిలియన్ డాలర్ల సెక్యూరిటీలు, ఇతర ఆస్తులు ఎఫ్‌డీఐసీ నియంత్రణలో కొనసాగుతాయి.ఎఫ్‌డీఐసీ నిర్వహించిన వేలం ప్రక్రియలో 110 బిలియన్ డాలర్ల ఎస్వీబీ ఆస్తులు, 56 బిలియన్ డాలర్ల డిపాజిట్లు, 72 బిలియన్ డాలర్ల రుణాలను ఫస్ట్ సిటిజన్ బ్యాంక్ టేకోవర్ చేస్తుంది. సిలికాన్ వాలీ బ్యాంక్‌కు చెందిన 17 శాఖలు సోమవారం నుంచి ఫస్ట్ సిటిజన్ బ్యాంక్ డివిజన్ కింద సేవలు ప్రారంభిస్తాయి.
ఎస్వీబీని టేకోవర్ చేసిన ఫస్ట్ సిటిజన్ బ్యాంకుకు 109 బిలియన్ డాలర్ల ఆస్తులు, 89.4 బిలియన్ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయి. తాజాగా ఎస్వీబీని కొనుగోలు చేసిన ఫస్ట్ సిటిజన్ బ్యాంకుకు ద్రవ్య లభ్యత సమస్య తలెత్తకుండా ఫస్ట్ సిటిజన్ బ్యాంక్‌కు ‘లైన్ ఆఫ్ క్రెడిట్’ వసతిని ఎఫ్‌డీఐసీ కల్పించనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers Protest | విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదు.. కరెంటు కోసం రైతుల రాస్తారోకో
‘యాసంగిలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలి’
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Angomcha Bimol | ఆ ఎంపీని సస్పెండ్ చేయండి.. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా ఎంపీలు
Eye Sight | భారతీయుల్లో పెరుగుతున్న దృష్టి లోపం సమస్య.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

