20 బిలియన్ డాలర్ల డీల్
అంతర్జాతీయ సాఫ్ట్వేర్ దిగ్గజం అడోబ్ భారీ టేకోవర్‌కు తెరతీసింది. ఆన్లైన్ డిజైనింగ్ స్టార్టప్ ఫిగ్మాను 20 బిలియన్ డాలర్ల విలువకు కొనుగోలు చేయనున్నట్టు గురువారం ప్రకటించింది.
- అడోబ్ చేతికి ఆన్లైన్ డిజైనింగ్ స్టార్టప్ ఫిగ్మా
కాలిఫోర్నియా, సెప్టెంబర్ 15: అంతర్జాతీయ సాఫ్ట్వేర్ దిగ్గజం అడోబ్ భారీ టేకోవర్‌కు తెరతీసింది. ఆన్లైన్ డిజైనింగ్ స్టార్టప్ ఫిగ్మాను 20 బిలియన్ డాలర్ల విలువకు కొనుగోలు చేయనున్నట్టు గురువారం ప్రకటించింది. 2012లో స్థాపితమైన ఫిగ్మా..ఇంటరాక్టివ్ మొబైల్, వెబ్ అప్లికేషన్లను డిజైన్ చేస్తున్నది. ఫిగ్మా వెబ్-బేస్డ్, మల్టీప్లేయర్ వర్క్ఫ్లోస్ సామర్థ్యాలతో అడోబ్ క్రియేటివ్ క్లౌడ్ టెక్నాలజీలను వెబ్‌లో డెలివరీ చేయడం వేగవంతమవుతుందని ఇరు కంపెనీలు తెలిపాయి. కాలిఫోర్నియా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అడోబ్.. కంటెంట్ ప్రమోషన్, పబ్లిషింగ్, క్రియేటింగ్కు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను విక్రయిస్తున్నది. 3డీ, వీడియో, వెక్టార్, ఇమేజింగ్, ఫాంట్స్‌లో అడోబ్కున్న నైపుణ్యంతో కొత్త టూల్స్, స్పేసెస్ బిల్డ్ చేస్తామని, కస్టమర్లు వారి ప్రాడక్టులను వేగంగా, సులభంగా డిజైన్ చేసుకునేందుకు వీలుపడుతుందని ఫిగ్మా సహ వ్యవస్థాపకుడు, సీఈవో డైలాన్ ఫీల్డ్ తెలిపారు. ఈ డీల్‌లో అడోబ్ కొంత నగదును, మరికొంత స్టాక్‌ను చెల్లిస్తుంది. ఫిగ్మా టీమ్‌కు ఫీల్డ్ నేతృత్వం కొనసాగుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

