మొండి గండం

- ఈ ఏడాది ప్రథమార్ధంలో ఎన్పీఏలు పెరగవచ్చంటున్న ఫిక్కీ-ఐబీఏ సర్వే
ముంబై, మార్చి 17: గతేడాది ద్వితీయార్ధంలో బ్యాంకుల అసెట్ క్వాలిటీ (ఆస్తుల నాణ్యత) కొంత మేరకు మెరుగుపడినప్పటికీ ఈ ఏడాది ప్రథమార్ధంలో వీటి నాణ్యత క్షీణించవచ్చని ఫిక్కీ-ఐబీఏ సర్వే వెల్లడించింది. 2020 జులై-డిసెంబర్ మధ్య కాలంలో 20 బ్యాంకులపై ఈ సర్వే జరిగింది. వీటిలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని బ్యాంకులతోపాటు విదేశీ బ్యాంకులు కూడా ఉన్నాయి. దేశీయ బ్యాంకింగ్ పరిశ్రమలో ఆస్తుల పరిమాణ పరంగా ఈ బ్యాంకులు దాదాపు 59 శాతం వాటాను కలిగి ఉన్నాయి. గతేడాది ద్వితీయార్ధంలో నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) తగ్గాయని ఈ సర్వే సగం బ్యాంకులు స్పష్టం చేయగా.. ఎన్పీఏల స్థాయి తగ్గినట్లు ప్రభుత్వ రంగంలోని దాదాపు 78 శాతం బ్యాంకులు తెలిపాయి. 2021 ప్రథమార్ధంలో ఎన్పీఏల స్థాయి 10 శాతానికిపైగా పెరగవచ్చని 68 శాతం బ్యాంకులు.. 12 శాతానికిపైగా పెరగవచ్చని 37 శాతం బ్యాంకులు అభిప్రాయపడ్డాయి. మరోవైపు ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి బ్యాంకుల మొత్తం ఆస్తుల్లో మొండి బాకీలు కనీసం 13.5 శాతానికి పెరగవచ్చని జనవరిలో విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదికలో రిజర్వు బ్యాంకు అంచనా వేసింది.
ప్రభుత్వ బ్యాంకుల్లో రూ.లక్ష కోట్లు తగ్గుదల
గతేడాది ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల నిరర్థక ఆస్తులు రూ.లక్ష కోట్లకు పైగా (రూ.6,78,317 కోట్ల నుంచి రూ.5,77,137 కోట్లకు) తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఎన్పీఏల గుర్తింపు, పరిష్కారం, సంస్కరణల అమలే ఇందుకు కారణమని పేర్కొన్నది. యూకో బ్యాంక్లో అత్యధికంగా 40.7% ఎన్పీఏలు తగ్గాయని, ఆ తర్వాతి స్థానాల్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (33.6%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (21.4%), కెనరా బ్యాంక్ (18.6 శాతం) ఉన్నాయని ప్రభుత్వం వివరించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- ficci-iba survey
- npas
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

