న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మాంద్యం ఆవరిస్తుందన్న సంకేతాలు వెలువడుతున్నా, ఐఐటీ క్యాంపస్ హైరింగ్‌కు స్టార్టప్‌లు, ఈ కామర్స్ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) క్యాంపస్‌ల్లో విద్యార్థులను అధిక వేతనాలతో ఆకర్షించే కన్సల్టింగ్, హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ కంపెనీలతో పోటీపడుతూ స్టార్టప్‌లు, ఈ-కామర్స్ సంస్థలు రూ.15.-35 లక్షల మేర వార్షిక ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో, ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్స్ నవీ, ైస్లెస్, జుపీ, గ్రో, సోషల్ కామర్స్ ప్లాట్‌ఫామ్ మీషో తదితర స్టార్టప్‌లు హైరింగ్ కోసం ఐఐటీల్లో అడుగుపెడుతున్నాయి. 2023 బ్యాచ్ నుంచి అభ్యర్థుల్ని రిక్రూట్ చేసుకునేందుకు దాదాపు 78 స్టార్టప్‌లు తమ వద్ద రిజిష్టర్ చేసుకున్నట్టు ఐఐటీ గౌహతి తెలిపింది. స్పేస్‌టెక్ స్టార్టప్ అగ్నికుల్, ఎలక్ట్రిక్ వెహికిల్ తయారీ స్టార్టప్ ఎథర్ ఎనర్జీ, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెంట్ ప్లాట్‌ఫామ్ అబాకస్ ఏఐ, ఫిన్‌టెక్ సంస్థ రేజర్పేలు ఐఐటీ మద్రాస్‌లో తాజాగా మొదలైన తొలిదశ ప్లేస్మెంట్ సీజన్ కోసం రిజిష్టర్ చేసుకున్నాయి.

ఐఐటీ బొంబే, ఢిల్లీ, హైదరాబాద్, మద్రాస్, కాన్పూర్, రూర్కీ, గౌహతి, బీహెచ్‌యూ (వారణాసి)లతో సహా దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ క్యాంపస్‌లను, బిజినెస్ స్కూల్స్‌ను తాము సందర్శిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధి తెలిపారు. డాటా సైన్స్, ప్రాడక్ట్ మేనేజర్ జాబ్స్ కోసం ఫ్లిప్‌కార్ట్ రూ.26-33 లక్షలు ఆఫర్ చేస్తున్నట్టు ఐఐటీల్లోని ప్లేస్మెంట్ టీమ్స్ తెలిపాయి. సైప్లె చైన్ అనలిటిక్స్, ప్రొడక్ట్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ రోల్స్ కోసం కాలేజీల్లో క్యాంపస్ హైరింగ్ జరుపుతున్నామని ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధి వెల్లడించారు.
స్టార్టప్‌లు, ఈ-కామర్స్ కంపెనీలు వాటి విస్తరణ ప్రణాళికల్ని ప్రారంభించేందుకు ఐఐటీల నుంచి రిక్రూట్ చేసుకుంటున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. మార్కెటింగ్ మేనేజర్, ఆపరేషన్ మేనేజర్ తదితర రోల్స్ కోసం తాము ఐఐటీయన్ల వైపు చూస్తున్నామని టైడ్ ఇండియా డిప్యూటీ కంట్రీ మేనేజర్ కుమార్ శేఖర్ చెప్పారు. ప్రసిద్ధ పీఈ ఫండ్ టైగర్ గ్లోబల్ నుంచి నిధులు అందుకున్న ఫిన్‌టెక్ జార్ తొలి క్యాంపస్ ప్లేస్‌మెంట్‌కు ఐఐటీ బీహెచ్‌యూను సందర్శిస్తున్నది.
రూ.15-20 లక్షల వేతనాన్ని ఆఫర్ చేస్తున్నది. కస్టమర్ ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫామ్ లోకోబజ్ తొలిసారిగా ఈ ఏడాది క్యాంపస్ ప్లేస్మెంట్లో పాల్గొనేందుకు ఐఐటీ బాంబేకు వెళుతున్నది. ఈ స్టార్టప్ ప్యాకేజి రూ.18-20 లక్షల మధ్య ఉంది. దీనికి తోడు రూ. 2 లక్షల పెర్ఫార్మెన్స్ బోనస్ కూడా ఆఫర్ చేస్తున్నది. తాము వృద్ధి దశలో ఉన్నామని, సరైన టాలెంట్‌ను రిక్రూట్ చేసుకోవడం తమ ప్రాధాన్యత అంటూ లోకోబజ్ సీఈవో విశాల్ అగర్వాల్ తెలిపారు. ఐఐటీల్లో టాలెంట్ క్రమశిక్షణతో ఉంటారని, ప్రస్తుత టెక్నాలజీ ట్రెండ్, పరిశ్రమలో పాటించే ఉత్తమ ప్రక్రియల పట్ల వారికి అవగాహన ఉంటుందని, అలాగే ఆలోచనా జ్ఞానంతో విశ్లేషించే సత్తా ఉంటుందని అగర్వాల్ వివరించారు.