EPFO-TDS | పీఎఫ్ విత్‌డ్రాపై టీడీఎస్ డిడక్షన్.. సెస్ అండ్ సర్‌చార్జీ కూడా!
EPFO-TDS | ఓ సంస్థలో చేరిన ఐదేండ్లలో రూ.50వేలకు పైగా పీఎఫ్ విత్‌డ్రా చేసినా, నాన్ రెసిడెంట్ల పీఎఫ్ ఖాతా వడ్డీపై టీడీఎస్ డిడక్ట్ చేస్తారు.
EPFO-TDS |ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నుంచి నగదు విత్ డ్రాయల్స్‌పై టీడీఎస్ (టాక్స్ డిడక్టెడ్ @ సోర్స్) డిడక్ట్ చేస్తారు. ఏదైనా సంస్థలో ఉద్యోగిగా చేరిన ఐదేండ్ల లోపు ఈపీఎఫ్‌వో నుంచి రూ.50 వేలకు పైగా విత్ డ్రా చేస్తే ఈ నిబంధన అమలవుతుంది. ఈపీఎఫ్ నుంచి నగదు విత్‌డ్రా చేసిన నాన్ రెసిడెంట్లకు టీడీఎస్ రూల్ అమలు చేస్తారు. టీడీఎస్ అమలు తీరిలా..
పాన్ కార్డ్‌తోపాటు ఫామ్ 15జీ/15హెచ్ సబ్మిట్ చేసిన వారి ఖాతా నుంచి టీడీఎస్ డిడక్ట్ చేయరు. ఒకవేళ ఫామ్ 15జీ / 15హెచ్ సబ్మిట్ చేయకుంటే మాత్రం 10 శాతం టీడీఎస్ డిడక్ట్ అవుతుంది.
గరిష్ట పరిమితికి తక్కువగా ఉందని ప్రకటించేందుకు ఆదాయం పన్ను చట్టం-1961లోని 197ఏ సెక్షన్‌లోని ఫామ్ 15జీ లేదా 15హెచ్ సబ్మిట్ చేస్తారు. అటువంటి వారి అకౌంట్ నుంచి టీడీఎస్ తప్పనిసరిగా డిడక్ట్ చేయరు.
పాన్ కార్డ్ సబ్మిట్ చేయని వారి అకౌంట్ నుంచి గరిష్ఠంగా 34.606 శాతం టీడీఎస్ కింద నగదు డిడక్ట్ చేస్తారు. నిధుల బదిలీ, అడ్వాన్స్ చెల్లింపులు, ఉద్యోగం నుంచి ఉద్వాసనకు గురైనప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయరు.
నాన్ రెసిడెంట్లకు వర్తించే నిబంధనలు
ఈపీఎఫ్ ఖాతాతో లింక్ అయిన పాన్ నంబర్ గల నాన్ రెసిడెంట్ల ఖాతా నుంచి 30 శాతం టీడీఎస్ లేదా పీఎఫ్ సభ్యుడి వద్ద నుంచి ద్వంద పన్ను ఎగవేత ఒప్పందం (డీటీఏఏ) కింద నిర్ధిష్ట పన్ను డిడక్ట్ చేస్తారు. నాన్ రెసిడెంట్ల ఖాతాల నుంచి టీడీఎస్ డిడక్షన్ అమలు చేయాల్సి వస్తే సెస్, సర్ చార్జీ వసూలు చేస్తారు. టీడీఎస్ మొత్తంపై నాలుగు శాతం సెస్ వసూలు చేస్తారు.
సర్‌చార్జి వసూలు చేసే రేటు ఇలా
- రూ.50 లక్షలపై వడ్డీకి సర్ చార్జీ వసూలు చేయరు.
- రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు వడ్డీపై 10 శాతం సర్‌చార్జీ
- రూ. కోటి నుంచి రూ.2 కోట్ల వరకు వడ్డీపై 15 శాతం సర్‌చార్జీ
- రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు వడ్డీపై 25 శాతం సర్ చార్జీ
- రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లు, అంతకంటే ఎక్కువ వడ్డీపై 37 శాతం సర్ చార్జీ
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

