న్యూఢిల్లీ : కోవిడ్ మహమ్మారితో ఉద్యోగం కోల్పోయిన ఓ ఇంజనీర్ బతుకుతెరువు కోసం స్విగ్గీ డెలివరీ బాయ్‌గా మారితే లింక్డిన్ యూజర్ల సాయంతో ఆపై కొత్త జాబ్‌లో అడుగుపెట్టాడు. మహమ్మారి కారణంగా జాబ్ కోల్పోయిన టెకీ స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తుండగా ఓ లింక్డిన్ యూజర్ అతడి స్టోరీని జాబ్ సెర్చ్ ప్లాట్‌ఫాంలో షేర్ చేయగా అవకాశాలు పోటెత్తాయి.
జమ్ముకు చెందిన సాహిల్ సింగ్ బైజూస్‌లో పనిచేశాడు. కరోనా వైరస్ వేగంగా ప్రబలుతున్న సమయంలో అతడు స్వస్ధలానికి రావాల్సిన క్రమంలో ఉద్యోగం కోల్పోయాడు. ఆపై స్వస్ధలంలో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా కుదురుకున్నాడు. ప్రియాన్షి చందేల్ అనే మహిళకు ఆర్డర్ డెలివరీ చేయాల్సి ఉండగా, బైక్ అద్దె చెల్లించేందుకు అవసరమైన డబ్బు లేకపోవడంతో నడుచుకుంటూ వెళ్లి ఆర్డర్ డెలివరీ చేయాల్సి వచ్చింది.
సాహిల్ దయనీయ పరిస్ధితిని గమనించిన చందేల్ అతడి మార్క్ షీట్, బీటెక్ డిగ్రీ సర్టిఫికెట్ సహా పూర్తి వివరాలను జాబ్ సెర్చి ప్లాట్‌ఫాంలో షేర్ చేసి ఎవరైనా అతడికి సాయం చేయాలని అభ్యర్ధించింది. ఈ పోస్ట్ లింక్డిన్లో వైరల్ కావడంతో సాహిల్‌కు ప్రస్తుతం ఫుల్ టైం జాబ్ దొరికింది.
Read More :