Musk Doubts Twitter Takeover | మస్క్ `ట్విట్టర్` టేకోవర్ అనుమానమేనా? స్పామ్ ఖాతాలెక్కువ ఉన్నాయా?!
Musk Doubts Twitter Takeover | ట్విట్టర్‌ను ఎలన్‌మస్క్ టేకోవర్ చేయడంపై సందేహాలున్నాయి. స్పామ్ ఖాతాలపై క్లారిటీ ఇవ్వాలని అంటున్నారు.
Musk Doubts Twitter Takeover | అంతా ఊహించినట్లే జరుగుతున్నది. మైక్రోబ్లాగింగ్ సోషల్ మీడియా సైట్ ట్విట్టర్‌ను టేకోవర్ చేసుకునే విషయమై రకరకాల విన్యాసాలు చేసిన టెస్లా సీఈవో ఎలన్‌మస్క్.. విక్రయానికి ట్విట్టర్ బోర్డు ఓకే అన్నాక మెలిక పెట్టాడు. ట్విట్టర్టేకోవర్ బిడ్‌ను బ్రేక్ చేయడానికి అవసరమైన పాయింట్ లేవనెత్తాడు. ట్విట్టర్లో స్పామ్ అకౌంట్లు 20 శాతం ఉన్నాయని చెబుతున్నాడు. కానీ ట్విట్టర్లో ఫేక్ ఖాతాలు ఐదు శాతమేనని ఆ సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్ వివరణ ఇచ్చారు.
ట్విట్టర్ సీఈవో ఇచ్చిన సంఖ్య కంటే నాలుగు రెట్లు ఎక్కువగా స్పామ్ అకౌంట్లు ఉన్నాయని ఎలన్‌మస్క్ మండిపడ్డారు. స్టాక్ ఎక్స్చేంజీలకు ట్విట్టర్ ఇచ్చిన సమాచారం మేరకు రియల్ అకౌంట్స్ ఆధారంగా 44 బిలియన్ డాలర్లకు దాని టేకోవర్ చేయడానికి ఆఫర్ ఇచ్చానంటున్నారు. ఐదు శాతం ఖాతాలు మాత్రమే స్పామ్ ఖాతాలని రుజువు చేయడానికి ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ ముందుకు రాలేదు..కనుక అప్పటి వరకు ట్విట్టర్ టేకోవర్ డీల్ ముందడుగు వేయబోదని ట్విట్టర్లో ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ట్విట్టర్ సీఈవో చెప్పిన దానికంటే నాలుగు రెట్లు ఉన్న స్పామ్ ఖాతాలపై స్పష్టత రావాల్సిందేనని కుండబద్ధలు కొట్టేశారు.
ఒక్కో ట్విట్టర్ షేర్‌పై 54.20 డాలర్ల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం లేకపోలేదని ఇంతకుముందు ఎలన్‌మస్క్ పరోక్ష సంకేతాలు ఇచ్చారు. ట్విట్టర్ కొనుగోలు ప్లాన్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు గతవారం ప్రకటించారు. తాజాగా స్పామ్ ఖాతాలపై వివాదం నేపథ్యంలో అసలు ట్విట్టర్‌ను ఎలన్‌మస్క్ టేకోవర్ చేస్తారా? లేదా? అని వ్యాపార, వాణిజ్య వర్గాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

