Elon musk and Rents | రెంట్ కట్టని ఎలాన్ మస్క్.. దావా వేసిన ఇంటి ఓనర్
Elon musk and Rents | ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్.. తన ట్విట్టర్ కార్యాలయాల రెంట్లు కట్టడం లేదు. దీంతో కొత్త చిక్కుల్లో పడ్డాడు. శాన్ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయం ఉన్న భవనానికి రెంట్ చెల్లించాలంటూ ఇంటి యజమాని నోటీసులిచ్చారు.
Elon musk and Rents | ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపి విమర్శలు ఎదుర్కొన్న ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్.. తాజాగా మరో కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ట్విట్టర్ కార్యాలయం ఉన్న భవనానికి రెంట్ చెల్లించకపోవడంతో ఆ ఇంటి యజమాని మస్క్‌పై దావా వేశారు. 15 రోజుల క్రితం రెంట్ చెల్లించాలని కోరినప్పటికీ.. మస్క్ లైట్ తీసుకోవడంతో ఈ దావా వేయాల్సి వచ్చిందని భవనం యజమాని చెప్పారు. ఇదొక్కటే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు కార్యాలయాలకు కూడా ఇలానే రెంట్ బాకీ పడ్డట్లు తెలుస్తున్నది.
అమెరికా శాన్ఫ్రాన్సిస్కోలోని హార్ట్ ఫోర్డ్ బిల్డింగ్ 30 వ అంతస్తులో ట్విట్టర్ ప్రధాన కార్యాలయం ఉన్నది. ఈ భవనానికి అద్దె చెల్లించాలని గత నెల 15 న ఎలాన్ మస్క్ ప్రతినిధిని కలిసి ఇంటి యజమాని కోరాడు. 30 వ తేదీలోగా చెల్లించనిపక్షంలో లీజుపై డిఫాల్ట్ అవుతుందని కూడా స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని టైట్‌గా తీసుకున్న మస్క్.. రెంట్ చెల్లింపు జరపలేదు. దాంతో సదరు యజమాని కోర్టులో దావా వేశారు. ఈ విషయాన్ని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఈ భవనం అద్దె బకాయిగా రూ.1.1 కోట్లు చెల్లించాల్సి ఉన్నదని భవన యాజమాన్య సంస్థ కొలంబియా రెయిత్ ఆరోపించింది. ఈ మేరకు గత నెల 16 న నోటీసు ఇచ్చినట్లు కూడా సంస్థ పేర్కొన్నది.
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్ కేవలం శాన్ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయం భవనానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర కార్యాలయాలకు కూడా అద్దె చెల్లించలేదు. ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఆస్తి యజమానులు అద్దె పొందడం లేదు. భవనాలను ఖాళీ చేయాలని ట్విటర్‌ను భవన యజమానులు కోరుతున్నా.. కంపెనీ నుంచి ఎటువంటి స్పందన కనిపించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో భవనాలను ఖాళీ చేయాలని సంస్థ ప్రతినిధులపై ఒత్తిడి కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

