Elon Musk on Twitter | ట్విట్టర్ కోసం మస్క్ ఆప్షన్లు ఏమిటంటే?!
Elon Musk on Twitter | ట్విట్టర్‌ను పూర్తిగా కొనేయాలంటే ఎలన్‌మస్క్ టెస్లా షేర్లు విక్రయించాలి/ భారీ రుణం తీసుకోవాల్సిందే.
Elon Musk on Twitter | ఎలన్‌మస్క్.. పరిచయం అక్కర్లేని పేరు.. విద్యుత్ కార్ల సంస్థ టెస్లా.. స్పేస్ ఎక్స్ సీఈవో ఆయన.. ఇప్పుడు సోషల్ మీడియా వేదిక ట్విట్టర్‌ను పూర్తిగా కొనేస్తానంటున్నారు. దానివిలువ 43 బిలియన్ల డాలర్లు.. మొత్తం క్యాష్ ఆఫర్ అని ప్రకటించారు. ట్విట్టర్ కొనుగోలు ఆఫర్‌గా ప్రకటించిన మొత్తం.. ఎలన్‌మస్క్ 250.6 బిలియన్ల డాలర్ల వ్యక్తిగత సంపదలో దాదాపు ఆరోవంతు. ఆయన షేర్లలో మెజారిటీ టెస్లాలోనే ఉన్నాయి.
ఒకవేళ ఎలన్‌మస్క్ ఆఫర్‌ను ట్విట్టర్ బోర్డు ఆమోదిస్తే.. డబ్బు చెల్లించడానికి ఎలన్‌మస్క్ పలు ఫైనాన్సియల్ ఆప్షన్లు కలిగి ఉన్నారు. అందులో ఒకటి టెస్లాలో తన షేర్ల విక్రయం. లేదా తన వాటాపై బయటి వాటాదారులతో కలిసి రుణం తీసుకోవడం. ఇటీవల ట్విట్టర్లో 9.1శాతం వాటాను 2.6 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశాక ఎలన్‌మస్క్ వద్ద ఉన్న నిధుల నిల్వలు మూడు బిలియన్ల డాలర్లు.
ఎలన్‌మస్క్ ముంగిట రెండు ఆప్షన్లు ఉన్నాయి. వాటిల్లో ఒకటి భారీ రుణం తీసుకోవడం.. లేదా భారీ మొత్తంలో టెస్లా షేర్లు విక్రయించడం. తద్వారా 36 బిలియన్ల డాలర్ల నిధులు సమకూర్చుకోవాలి. టెస్లాలోని తన వాటాలో ఐదో వంతు అంటే సుమారు 36.5 మిలియన్ల షేర్లు విక్రయించాల్సి ఉంటుంది. కానీ ఐదో వంతు షేర్లను విక్రయించడం వల్ల టెస్లా సీఈవోగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావచ్చు. సంస్థ షేర్ విలువ పతనం కావచ్చు. ఇక మరో ఆప్షన్ టెస్లా లేదా స్పేస్ ఎక్స్ షేర్లపై రుణం తీసుకోవడం.
ప్రపంచంలోకెల్లా అత్యంత సంపన్నుడు ఎలన్‌మస్క్.. అందులో సందేహం లేదు.. కానీ ఆయనకు కూడా పరిమితులు ఉన్నాయి. ఇప్పటికే తన వాటాలపై మస్క్ 20 బిలియన్ల డాలర్ల రుణం తీసుకున్నారు. రెండు సంస్థల నుంచి 35 బిలియన్ల డాలర్ల విలువైన రుణాలు తీసుకోవాల్సి ఉంటుంది. ట్విట్టర్‌కు 43 బిలియన్ల డాలర్ల ఎలన్‌మస్క్ బెస్ట్ అండ్ ఫైనల్ ఆఫర్ వెనుక పలు షరతులు ఉన్నాయి. నిధులు సమకూర్చుకోవడం ప్రధాన సమస్యగా పరిణమిస్తుంది. తక్కువ లాభంతోనే విజయం సూత్రంపై ఆధారపడి మస్క్ ముందుకెళ్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

