Elon Musk is Top CEO | ప్రపంచంలోని కార్పొరేట్ సంస్థల సీఈవోల్లో అత్యధిక వేతనం తీసుకుంటున్న సీఈవో ఎవరో తెలుసా.. ఇంకెవరు.. టెస్లా అండ్ స్పేస్ ఎక్స్ సీఈవోగా ఎలన్‌మస్క్.. ఫార్చ్యూన్-500 సంస్థల సీఈవోల్లో అత్యధిక వేతనం అందుకుంటున్నారు. ఫార్చ్యూన్ -500లో టాప్-10 సీఈవోల్లో మస్క్ ఒకరు. మస్క్ తర్వాత జాబితాలో ఆపిల్ సీఈవో టిమ్ కుక్, నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన రీడ్ హాస్టింగ్స్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఉన్నారు. ఇందులో టెక్, బయోటెక్ సంస్థల అధినేతలు కూడా ఉన్నారు.
గతేడాది (2021)లో ఎలన్‌మస్క్ పొందిన వేతనం 23.5 బిలియన్ల డాలర్లు. ఫార్చ్యూన్-500 కంపెఈనల జాబితాలో టెస్లా 65వ స్థానంలో నిలిచింది. 2020తో పోలిస్తే 71 శాతం ఆదాయం పెంచుకున్న టెస్లా గతేడాది ఆదాయం 53.9 బిలియన్ డాలర్లు.
గతేడాది టెక్ దిగ్గజం ఆపిల్ సీఈవో టిమ్ కుక్ వేతనం 770.5 మిలియన్ల డాలర్లు. ఫార్చ్యూన్-500 కంపెనీల జాబితాలో ఆపిల్‌కు మూడో స్థానం ఉంది. అంతర్జాతీయంగా చిప్ కొరత సమస్యను ఎదుర్కొన్నా ఆపిల్ ఉత్పత్తులు మాత్రం విజయవంతంగా కొనసాగిస్తూనే ఉంది. కాగా, న్విదియా సంస్థ కో ఫౌండర్ హాంగ్, నెట్‌ఫ్లిక్స్ సీఈవో రీడ్ హాస్టింగ్స్ వేతనాల్లో మూడో, నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.