2023నాటికి విద్యుత్ వాహనాల సేల్స్ 23% గ్రోత్!
2023నాటికి విద్యుత్ వాహనాల సేల్స్ 23% గ్రోత్!| కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇన్సెంటివ్‌ల నేపథ్యంలో 2020-23 మధ్య విద్యుత్ వాహనాల కొనుగోళ్లలో పురోగతి ....

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు భగభగ మండుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇన్సెంటివ్‌ల నేపథ్యంలో 2020-23 మధ్య విద్యుత్ వాహనాల కొనుగోళ్లలో పురోగతి నమోదు కానున్నది. ఈ మూడేండ్లలో ఏటా 26 శాతం విద్యుత్ వాహనాల కొనుగోళ్లు పెరుగుతాయని తెలుస్తున్నది.
కోవిడ్-19 మహమ్మారితో ఆర్థిక రంగంపై ప్రతికూల ప్రభావం, దేశీయంగా పరిమితంగా వాహనాల ఉత్పత్తి వంటి అంశాలు విద్యుత్ వాహనాల విస్తరణకు సవాళ్లుగా పరిణమిస్తాయని ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ పేర్కొంది.
భారీగా పెట్రోల్/ డీజిల్‌లపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం విధించింది. మరోవైపు, విద్యుత్ వాహనాల విక్రయాలను ప్రోత్సహించేందుకు పలు చర్యలు తీసుకున్నది.
విద్యుత్ వాహనాల విక్రయంపై జీఎస్టీని 12 నుంచి ఐదు శాతానికి తగ్గించింది. మరోవైపు, విద్యుత్ వాహనాలను కొనుగోలు చేసిన వారికి ఆదాయం పన్ను మినహాయింపునిచ్చింది.
2030 నాటికి ఆసియా రీజియన్‌లో 10.9 మిలియన్ల యూనిట్ల విద్యుత్ వాహనాలు అమ్ముడు అవుతాయని ఫిచ్ అంచనా వేసింది. గతేడాది 14 లక్షల విద్యుత్ వాహనాలు అమ్ముడవుతాయని పేర్కొంది. చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాల్లో 2029 వరకు విద్యుత్ వాహనాలకు డిమాండ్ ఎక్కువ అవుతుందన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

