Aadhaar and Post Office Franchise : ఆధార్, పోస్ట్ ఆఫీస్ ప్రాంచైజ్‌లు తీసుకోండి.. ఊళ్లోనే ఉంటూ డబ్బులు సంపాదించండి
ఆధార్, పోస్ట్ ఆఫీస్ ప్రాంచైజ్‌లు తీసుకోండి | ఈరోజుల్లో యువత ఉద్యోగాల కంటే కూడా సొంతంగా బిజినెస్ చేయడం వైపే ఎక్కువగా మొగ్గు చూపుతోంది.
ఈరోజుల్లో యువత ఉద్యోగాల కంటే కూడా సొంతంగా బిజినెస్ చేయడం వైపే ఎక్కువగా మొగ్గు చూపుతోంది. కానీ.. సొంతంగా బిజినెస్ అంటే లక్షలు ఖర్చు పెట్టాలి. అయితే.. అన్ని బిజినెస్‌లకు లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా సొంత బిజినెస్‌లు స్టార్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
కొన్ని బిజినెస్‌లు చేస్తే నష్టం వస్తుందేమో అని భయపడతారు. కానీ.. ఈ బిజినెస్‌లలో తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం.. అందులోనూ ఊళ్లోని ఉండి.. సొంతంగా బిజినెస్ పెట్టుకొని డబ్బులు సంపాదించుకునే బ్రహ్మాండమైన అవకాశం. ఇంతకీ ఏంటి ఆ బిజినెస్‌లు అంటారా? ఆధార్ కార్డు ప్రాంచైజ్, పోస్ట్ ఆఫీస్ ప్రాంచైజ్. అవును… ఈ బిజినెస్‌లు గవర్నమెంట్ ప్రాంచైజ్‌లు. అంటే.. వంద శాతం ప్రాఫిట్ ఉండే బిజినెస్ అన్నమాట. అలాగే.. ఈ బిజినెస్‌ల ద్వారా నష్టం అనేదే ఉండదు. వీటిని పెట్టడం కోసం లక్షలు ఖర్చుపెట్టాల్సిన అవసరం అస్సలే ఉండదు.
ఆధార్ కార్డ్ ప్రాంచైజ్ను ఎలా ప్రారంభించాలి?
ఆధార్ కార్డ్ అనేది ఇప్పుడు మన దేశంలో చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. అది ఉంటేనే ఏ పని అయినా జరుగుతుంది. సిమ్ కార్డు నుంచి బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలన్నా.. ఆధార్ కార్డు ఖచ్చితంగా కావాల్సిందే. అందుకే.. ఆధార్ కార్డు ప్రాంచైజ్ తీసుకుంటే.. మంచి ఆదాయం వస్తుంది.

మీ ఊళ్లో ఆధార్ కార్డు ప్రాంచైజ్ ఏర్పాటు చేయాలంటే ముందు యూఐడీఏఐ నిర్వహించే పరీక్షలో పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆధార్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడానికి లైసెన్స్‌ను ఇస్తారు. ఆ లైసెన్స్‌ను ఉపయోగించి.. ఆధార్ సర్వీస్ సెంటర్‌ను మీకు నచ్చిన చోట ఏర్పాటు చేసుకోవచ్చు. హ్యాపీగా ఊళ్లోనే ఉంటూ.. ఆధార్ కార్డు సర్వీసుల మీద డబ్బులు సంపాదించుకోవచ్చు.
ఆధార్ ప్రాంచైజ్ లైసెన్స్ కోసం అప్లయి చేయాలనుకుంటే.. https://uidai.nseitexams.com/UIDAI/LoginAction_input.action ఈ వెబ్సైట్లోకి వెళ్లి అప్లయి చేసుకోండి.
పోస్ట్ ఆఫీస్ ప్రాంచైజ్ ఎలా ప్రారంభించాలి?
ఇండియన్ పోస్ట్ సంస్థ.. ఈ పోస్ట్ ఆఫీస్ ప్రాంచైజ్ను అందిస్తుంది. ప్రభుత్వ ప్రాంచైజ్‌లు తీసుకోవాలని అనుకునే వాళ్లకు ఇది బెస్ట్ ప్రాంచైజ్. కేవలం 5000 రూపాయల కడితే చాలు.. ఈ ప్రాంచైజ్ లైసెన్స్‌ను ఇండియన్ పోస్ట్ ఇస్తుంది. ఇండియన్ పోస్ట్ ప్రాంచైజ్ ఆఫీస్ ఓపెన్ చేసి.. పోస్ట్ సేవలను కస్టమర్లకు అందించి.. కమిషన్‌ను సంపాదించుకోవచ్చు.

అయితే.. ఇందులో రెండు రకాల ప్రాంచైజ్‌లు ఉంటాయి. ఒకటి ఔట్లెట్.. ఇంకోటి పోస్టల్ ఏజెంట్స్ ప్రాంచైజ్. పోస్టల్ ప్రాంచైజ్కు ఎలా అప్లయి చేయాలో ఈ పీడీఎఫ్‌లో అన్ని వివరాలు ఉన్నాయి. ఈ పీడీఎఫ్‌ను చెక్ చేసి.. మీ ఊళ్లోనే పోస్టల్ ప్రాంచైజ్ను ప్రారంభించడం కోసం అప్లయి చేసుకోండి. లేదంటే ఇండియా పోస్ట్ వెబ్సైట్లోకి వెళ్లి కూడా అప్లయి చేసుకోవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

