ముంబై, జూన్ 17: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ దేశవ్యాప్తంగా మరో 100 ప్రత్యేక అర్బన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను ప్రారంభించింది. ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ల్లో ఈ గిడ్డంగ్లను ఆరంభించినట్టు ప్రకటించింది. మెట్రో నగరాల్లో డెలివరీని మరింత వేగవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ సెంటర్లను నెలకొల్పినట్టు, అలాగే క్విక్ కామర్స్ సేవలను మరో 100 నగరాలకు విస్తరించనున్నట్టు తెలిపింది.
దుస్తులు, ఎలక్ట్రానిక్స్, ఆభరణాలు, ఫర్నిచర్, సరుకులే కాకుండా, పర్సనల్ కేర్, ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్స్‌లపై ప్రత్యేక రాయితీతో విక్రయిస్తున్నది. ఈ నెల 23న ప్రారంభంకానున్న ప్రైమ్ డే ఆఫర్లు నాలుగు రోజులపాటు జరుగనున్నది.