న్యూఢిల్లీ : డుకాటి ప్రతి సంవత్సరం నిర్వహించే వరల్డ్ ప్రీమియర్స్‌లో కంపెనీ లాంఛ్ చేసే న్యూ మోటార్ సైకిళ్లు, వినూత్న మోడల్స్ ఫస్ట్‌లుక్స్‌ను ఆవిష్కరించడం పరిపాటి. 2022 సీజన్ ఆరో ఎపిసోడ్లో డుకాటి తన సరికొత్త డెజర్ట్X ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది చివరిలో సేల్స్ ప్రారంభం కానున్న డెజర్ట్X బైక్ డెలివరీలు వచ్చే ఏడాది మే నుంచి కస్టమర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. స్పోర్టీ రేసింగ్ స్టైల్లో రానున్న డెజర్ట్X బైక్ డకార్ రేస్ బైక్స్ ఇన్స్పిరేషన్తో డిజైన్ చేస్తారు.
937 సీసీతో పవర్ఫుల్ ఇంజన్‌తో ఎలాంటి రోడ్లపైనైనా దూసుకెళ్లేలా డెజర్ట్X బైక్ కస్టమర్లను ఆకట్టుకోనుంది. ఇరుకైన, గతుకుల రోడ్లు, పర్వత ప్రాంతాలు, మట్టి రోడ్ల వంటి ఎలాంటి పరిమితులు లేకుండా కస్టమర్లకు ఈ బైక్ అనుకూలంగా ఉంటుందని డుకాటి వెల్లడించింది. ఎండ్యురో రైడింగ్ మోడ్, న్యూ ర్యాలీ రైడింగ్, స్పోర్ట్, టూరింగ్, అర్బన్, వెట్ రైడింగ్ మోడ్ సహా పలు అత్యాధునిక పీచర్లతో డెజర్ట్X బైక్‌ను డుకాటి తన కస్టమర్ల ముందుకు తీసుకురానుంది.