Honda Cars | హోండా కార్స్ బంపరాఫర్.. డ్రైవ్ ఇన్ 2022- పే ఇన్ 2023.. ఇవీ డిటైల్స్!
Honda Cars | ఫెస్టివ్ సీజన్లో హోండా కార్స్ బంపర్ఆఫర్ తెచ్చింది. అమేజ్, సిటీ వేరియంట్లపై `డ్రైవ్2022-పే 2023` ఆఫర్ అందిస్తోంది.
Honda Cars | ప్రముఖ జపాన్ కార్ల తయారీ సంస్థ హోండా.. పండుగల సీజన్లో కార్ల విక్రయాలు పెంచుకోవాలని చూస్తోంది. ఇందుకోసం దేశీయ కార్ల వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. `డ్రైవ్ ఇన్ 2022- పే ఇన్ 2023` స్కీమ్ ప్రవేశపెట్టింది. ప్రస్తుత పండుగల సీజన్లో ఎటువంటి ఇన్స్టాల్మెంట్ పే చేయకుండానే హోండా అమేజ్, హోండా సిటీ వేరియంట్ కార్లను తీసుకోవచ్చు. ఈ నెలాఖరు వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుంది. 2023 నుంచి ఈఎంఐ చెల్లింపులు ప్రారంభం అవుతాయి.
కొటక్ మహీంద్రా ప్రైమ్ లిమిటెడ్ (కేఎంపీఎల్) భాగస్వామ్యంతో హోండా కార్స్ ఈ ఆఫర్ తీసుకొచ్చింది. ఈ ఆఫర్ హోండా డీలర్స్, కేఎంపీఎల్ బ్రాంచ్‌ల వద్ద అందుబాటులో ఉంటుంది. హోండా కార్స్ ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బాల్ మాట్లాడుతూ ` కొటక్ మహీంద్రా ప్రైమ్ లిమిటెడ్ భాగస్వామ్యంతో మా కస్టమర్లకు ఏకీకృత అవకాశం తీసుకొచ్చింది. హోండా ఫ్యామిలీలో భాగస్వాములు కావాలని మా కస్టమర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం` అని చెప్పారు.
కారు ధరలో 85 శాతం రుణ పరపతి కల్పిస్తోంది హోండా కార్స్. తొలి మూడు నెలలు నెలసరి వాయిదా (ఈఎంఐ) చాలా తక్కువ. నాలుగో నెల నుంచి రెగ్యులర్ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఇది చివరి నెల వాయిదా వరకు కొనసాగుతుంది. కొటక్ మహీంద్రా ప్రైమ్ లిమిటెడ్ (కేఎంపీఎల్) హోల్‌టైం డైరెక్టర్ & ప్రెసిడెంట్ షారూఖ్ తొడివాలా మాట్లాడుతూ.. `హోండా కార్ ఇండియాతో మేం ఎల్లవేళలా భాగస్వాములం. హోండా కార్స్ కస్టమర్లను మా భాగస్వామ్యం ఆకట్టుకుంటుందని మేం ఆశాభావంతో ఉన్నాం. హోండా కారు కొనుగోలు చేయాలనుకున్న కస్టమర్లు ఈ స్కీమ్‌తో బెనిఫిట్ పొందాలని కోరుతున్నాం` అని చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
Smart Phone Tips | మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? ఈ సెట్టింగ్స్ మార్చి చూడండి
సింపుల్ లుక్‌తోనే మాయ చేస్తోన్న వైష్ణవి చైతన్య.. ఫొటోలు చూశారా?
Ghee Benefits | నెయ్యితో యవ్వనం సాధ్యమేనా? చర్మ సౌందర్యానికి నెయ్యి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

