రిటైర్మెంట్ తర్వాత మెడికల్ ప్రయోజనాలు కల్పించే సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ. గ్రూపు పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ బెనిఫిట్ స్కీం పేరుతో విడుదల చేసిన ఈ ప్లాన్ నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, లైఫ్, గ్రూపు సేవింగ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ అని తెలిపింది.
ఈ ప్లాన్ ద్వారా ప్రతి సభ్యుడికి ఫిక్స్డ్ లైఫ్ కవర్ ప్రయోజనాలు(సమ్ అస్యూర్డ్) పొందవచ్చును. 50 ఉద్యోగులు లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న సిబ్బంది కలిగిన సంస్థ ఈ ప్లాన్ను ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నది. పదవీ విరమణ తర్వాత ఆరోగ్య పరంగా సమస్యలు అధికంగా ఉంటాయని, ఇలాంటివారికి ఈ ప్లాన్ సరిపోతుందని వెల్లడించింది.