హైదరాబాద్, నవంబర్ 6: ప్రముఖ మొబైల్ విక్రయ సంస్థ బిగ్”సి’.. దీపావళి ప్రత్యేక ధమాకా ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ. 10 వేల వరకు ఇన్స్టాంట్ క్యాష్‌బ్యాక్‌తోపాటు రూ.4 వేల వరకు విలువైన ఖచ్చితబహుమతిని అందిస్తున్నట్టు కంపెనీ ఫౌండర్, సీఎండీ బాలు చౌదరి తెలిపారు. వీటితోపాటు స్మార్ట్‌వాచ్ ఆఫర్, లాయల్టీ పాయింట్స్ ఆఫర్, స్మార్ట్ టీవీ ఆఫర్, 1+1 ఎక్స్టెండెడ్ ఆఫర్ లాంటి మరెన్నో ఆఫర్లు కలవని ఆయన పేర్కొన్నారు. వీటితోపాటు బజాజ్ ఫైనాన్స్ కార్డుతో మొబైల్ కొనుగోలుపై రూ.9 వేల వరకు ఇన్స్టాంట్ క్యాష్ బ్యాక్, మొబైల్/స్మార్ట్ టీవీ/ల్యాప్‌టాప్ కొనుగోలుపై ఎస్బీఐ కార్డుతో రూ.3 వేల వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్, ఐడీఎఫ్ఎస్ కార్డు ద్వారా జరిపే లావాదేవీలకు రూ.7,500 వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నది. ప్రతి స్మార్ట్ టీవీ కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతితోపాటు రూ.5,199 విలువ కలిగిన ఫింగర్స్ బార్ స్పీకర్‌ను రూ.2,499కే, ఐఫోన్లపై రూ.7 వేల వరకు ప్రయోజనాలు కల్పిస్తున్నది.