Maruti Suzuki Discounts | పండుగ సీజన్లో మారుతి కార్ల ఆఫర్ల వర్షం..
Maruti Suzuki Discounts | పండుగల సీజన్ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఎంపిక చేసిన కార్లపై గరిష్టంగా రూ.60 వేల వరకు డిస్కౌంట్లు అందిస్తున్నది.
Maruti Suzuki Discounts | గత నెలాఖరులో ఓనం వేడుకలతో దేశంలో పండుగల సీజన్ ప్రారంభమైంది. భారతీయులు ఎక్కువగా పండుగల సీజన్లోనే తమకు ఇష్టమైన, అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పండుగల సీజన్లో కస్టమర్లను ఆకర్షించేందుకు మారుతి సుజుకి పలు మోడల్ కార్లపై సెప్టెంబర్ నెలలో భారీగా డిస్కౌంట్ ప్రకటించింది. ఎంపిక చేసిన ఎనిమిది మోడల్ కార్లపై రూ.62 వేల వరకు రాయితీలు లభిస్తాయి. ఎరీనా డీలర్ల వద్ద క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ రూపంలో డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో, వాగన్-ఆర్, సెలెరియో, స్విఫ్ట్, డిజైర్, ఎర్టిగా, ఎకో మోడల్ కార్లపై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. మారుతిసుజుకి పాపులర్ మోడల్ ఎస్యూవీ కారు బ్రెజాపై మాత్రం ఎటువంటి డిస్కౌంట్లు లేవు.
వ్యాగన్-ఆర్ పై ఇలా
వ్యాగన్-ఆర్ కొనుగోలుదారులకు క్యాష్ డిస్కౌంట్ రూపంలో రూ.35 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ.20 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.4000 అందిస్తున్నది. అదనంగా సీఎన్జీ వేరియంట్ వ్యాగన్-ఆర్ పై రూ.30 వేల క్యాష్ డిస్కౌంట్‌తోపాటు మొత్తం రూ.54 వేల రాయితీ అందుబాటులో ఉంది.
స్విఫ్ట్‌పై రూ.54 వేల రాయితీ
హ్యాచ్ బ్యాక్ మోడల్ కారు స్విఫ్ట్‌పై గరిష్టంగా రూ.55 వేల వరకు రాయితీ లభిస్తుంది. క్యాష్ బెనిఫిట్ రూపంలో రూ.35 వేలు, ఎక్స్చేజ్ బోనస్ రూపంలో రూ.20 వేలు, కార్పొరేట్ బోనస్ రూపంలో రూ.5000 రాయితీ లభిస్తుంది. అన్ని వేరియంట్లకు ఈ రాయితీ లభించదు. జడ్ఎక్స్ఐ, జడ్ఎక్స్ఐ+ వేరియంట్లపై క్యాష్ డిస్కౌంట్ రూ.25 వేలు, ఏడేండ్లు దాటిన కారు ఎక్స్చేంజ్ పైనా ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.15 వేలకు కుదించింది.
ఆల్టో కే10పై ఇలా
మారుతి ఆల్టో కే10 కారుపై రూ.54 వేల వరకు రాయితీ ఆఫర్ చేసింది. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ మీద క్యాష్ డిస్కౌంట్ రూ.35 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ.15 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.4,000 లభిస్తుంది. పెట్రోల్ ఆటోమేటిక్, సీఎన్జీ వర్షన్ కార్లపై క్యాష్ డిస్కౌంట్ రూ.20 వేలు మాత్రమే లభిస్తుంది. మారుతి డిజైర్, ఎర్టిగా, ఎకో మోడల్ కార్లపై రూ.59 వేల నుంచి రూ.20 వేల వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

