Renault Discounts | సెలెక్టెడ్ రెనాల్ట్ కార్లపై ఇలా రూ.50 వేల వరకు డిస్కౌంట్లు !
Renault Discounts | ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్డ్.. క్విడ్, కైగర్, ట్రైబర్‌లపై రూ.50 వేల వరకు వివిధ డిస్కౌంట్లు అందిస్తున్నది.
Renault Discounts | ప్రస్తుతం నడుస్తున్న పండుగల సీజన్ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్డ్ కొత్త కార్ల కొనుగోలుపై తన కస్టమర్లకు రూ.50 వేల వరకు డిస్కౌంట్లు అందిస్తుంది. క్విడ్ హ్యాచ్‌బ్యాక్, ట్రైబర్ మల్టీ పర్పస్ వెహికల్ (ఎంపీఎస్), కైగర్ కంపాక్ట్ ఎస్యూవీ కార్లపై ఈ నెలలో డిస్కౌంట్లు అందుబాటులోకి తెచ్చింది. క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్లతోపాటు ఈజీ కేర్ మెయింటెనెన్స్ ప్యాకేజీపై 10 శాతం డిస్కౌంట్ అందిస్తున్నది, రూ.10 వేల విలువైన స్క్రాపేజీ స్కీమ్ బెనిఫిట్లు పొందొచ్చు. ఆయా కార్లపై రెనాల్ట్ డిస్కౌంట్లు ఇలా..
ట్రైబర్‌పై గరిష్ఠంగా రూ.50 వేల వరకు ఆదా
4-మీటర్స్ సబ్ మల్టీ పర్పస్ వెహికల్స్ (ఎంపీవీ) ట్రైబర్ కారుపై మొత్తం రూ.50 వేల డిస్కౌంట్ అందిస్తున్నది. సెవెన్ సీటర్ కెపాసిటీ గల ట్రైబర్ 72 హెచ్‌పీ విద్యుత్ సామర్థ్యం కలిగి ఉంది. 1.0 లీటర్ల పెట్రోల్ ఇంజిన్, 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ కలిగి ఉంటుంది.
రెనాల్ట్ ట్రైబర్‌పై క్యాష్ డిస్కౌంట్లు రూ.15 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ బెనిఫిట్లు రూ.25 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్లు రూ.10 వేలు అందిస్తున్నది. ట్రైబర్ లిమిటెడ్ ఎడిషన్ కారులో అదనపు ఫీచర్లు వస్తాయి. ట్రైబర్ లిమిటెడ్ ఎడిషన్ కారుపై రూ.45 వేల వరకు రాయితీ లభిస్తుంది. క్యాష్ డిస్కౌంట్స్ పేర రూ.10వేలు, ఎక్స్చేంజ్ బోనస్లుగా రూ.25 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.10 వేలు అందిస్తున్నది.
క్విడ్‌పై రూ.35 వేల వరకు పొదుపు
2019లో వచ్చిన క్విడ్ ఫేస్‌లిఫ్ట్ రెండు పవర్ ట్రైన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. దీనిపై గరిష్టంగా రూ.35 వేల డిస్కౌంట్లు లభిస్తాయి. క్యాష్ బెనిఫిట్ రూపేణా రూ.10వేలు, ఎక్స్చేంజ్ బెనిఫిట్ రూపంలో రూ.15,000, కార్పొరేట్ డిస్కౌంట్‌గా రూ.10 వేలు లభిస్తుంది.0.8 లీటర్ల వర్షన్ కారుపై ఎక్స్చేంజ్ బెనిఫిట్ రూ.10 వేలు మాత్రమే లభిస్తుంది. 1.0 లీటర్ల సామర్థ్యం గల ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్, ఎఏంటీ ట్రాన్స్మిషన్ కెపాసిటీ కలిగి ఉంటుంది. 0.8 లీటర్ల సామర్థ్యం గల ఇంజిన్‌తో కూడిన వేరియంట్ కారులో 54 హెచ్‌పీ ఇంధన సామర్థ్యం, 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎంటీ ట్రాన్స్మిషన్ ఆప్షన్‌తో రూపుదిద్దుకున్నది.
కైగర్‌పై రూ.10 వేల వరకు ఆదా
రెనాల్ట్ కైగర్‌పై అతి తక్కువగా డిస్కౌంట్ లభిస్తున్నది. అప్డేటెడ్ కంపాక్ట్ ఎస్యూవీ కారు ఈ ఏడాది మార్చిలో మార్కెట్లోకి వచ్చింది. 100 హెచ్పీతోపాటు 1.0 లీటర్ల టర్బో- పెట్రోల్, 72 హెచ్‌పీ విత్ 1.0 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో వచ్చింది. జూలైలో అప్డేటెడ్ కైగర్ 50 వేల యూనిట్ ఉత్పత్తి చేశారు. దీనిపై గరిష్ఠంగా రూ.10 వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్ పొందొచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Business news
- Kwid
- Renault
- Triber
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

