Malware | స్పిన్ ఓకే మాల్వేర్తో ముప్పు.. ఆ యాప్స్ డిలిట్ చేయాలంటూ డాక్టర్ వెబ్ వార్నింగ్!
Malware | ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు మాల్వేర్ ముప్పు పొంచి ఉంది. దాదాపు 420 మిలియన్ల
Malware | రివార్డు పాయింట్లు, బహుమతుల పేరిట ఆండ్రాయిడ్ ఫోన్ల యూజర్లను సైబర్ మోసగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. అందుకు స్పిన్ వీల్ అనే గేమింగ్ యాప్ వాడుకుంటున్నారు. స్పిన్ వీల్ యాప్ లో స్పిన్ ఓకే పేరుతో ఉన్న వైరస్ చేరింది. ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లో గల దాదాపు 100 యాప్‌ల్లో ఈ వైరస్ ఉన్నట్లు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ `డాక్టర్ వెబ్ (Doctor Web) గుర్తించింది. కనుక ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోన్లలోని ఈ గేమింగ్ యాప్స్ తక్షణం డిలిట్ చేయాలని హితవు చెప్పింది.
`ఆండ్రాయిడ్ ప్లే స్టోర్‌లోని 101 గేమింగ్ యాప్స్‌లో స్పిన్ ఓకే మాల్వేర్ ఉన్నట్లు మా పరిశోధనల్లో తేలింది. ఎక్కువగా స్పిన్ వీల్ గేమ్ సంబంధిత యాప్స్‌లోనే ఉన్నది. రివార్డు పాయింట్లు, రోజువారీ బహుమతుల ఆశ చూపి యూజర్లను ఆకర్షిస్తున్నాయి. ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నాక `స్పిన్ ఓకే` వైరస్ సాయంతో యూజర్ల ఫోన్లలో పర్సనల్, బ్యాంకింగ్ డేటా, ఫైల్స్ హ్యాకర్లు సేకరిస్తున్నారు. ఈ స్పై మాల్వేర్ (స్పిన్ ఓకే) ఉన్న యాప్‌లు 400కి పైగా మిలియన్ల యూజర్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. వారంతా తమ ఫోన్ల నుంచి, డివైజ్‌ల నుంచి ఈ యాప్స్ తక్షణం తొలగించడం మేలు` అని డాక్టర్ వెబ్ స్పష్టం చేసింది.
యూజర్లు యాప్‌లు డౌన్లోడ్ చేయడానికి ముందు వాటి ప్లే ప్రొటెక్షన్ సర్టిఫికెట్ చెక్ చేసుకోవాలి. పేరు సరిగా లేని యాప్‌లు డౌన్ లోడ్ చేసుకోకపోవడమే బెటర్. ప్లే స్టోర్‌లో గూగుల్ ప్లే ప్రొటెక్ట్ ఎనేబుల్ చేసుకోవాలి. యూజర్లు యాప్‌లు డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడు వాటిల్లో మాల్వేర్ ఉంటే సంబంధిత యూజర్‌కి `ప్లే ప్రొటెక్ట్ అలర్ట్` మెసేజ్ వస్తుంది. ప్లే స్టోర్‌లో ఏ యాప్ పైనైనా రెడ్ ప్లాగ్ ఉంటే అది డౌన్లోడ్ చేయొద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

