Credit Card | క్రెడిట్ కార్డు యూజర్లకు వీసా ఆఫర్.. సీవీవీ నంబర్ లేకుండానే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్.. !
Credit Card | ప్రముఖ పేమెంట్ సర్వీసెస్ సంస్థ వీసాకార్డు.. ఆర్బీఐ టోకెనైజేషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా తన క్రెడిట్ కార్డు యూజర్లకు సీవీవీ ఫ్రీ ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి తెచ్చింది.
Credit Card | క్రెడిట్ కార్డు హోల్డర్లకు ప్రముఖ ఇంటర్నేషనల్ పేమెంట్స్ జెయింట్ వీసా కార్డ్ బంపరాఫర్ తీసుకొచ్చింది. ఫ్రాడ్, స్కామ్‌లకు అడ్డుకట్ట వేయడానికి భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) తీసుకొచ్చిన టోకెనైజేషన్ విధానానికి అనుగుణంగానే వీసా కార్డ్.. `సీవీవీ-ఫ్రీ` ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. సీవీవీ అంటే కార్డ్ హోల్డర్ వెరిఫికేషన్ వాల్యూ (CVV-cardholder verification value). సీవీవీ ఫ్రీ ఆన్ లైన్ లావాదేవీల విధానాన్ని తీసుకొచ్చిన తొలి పేమెంట్ సంస్థగా `వీసాకార్డ్` నిలిచింది.
సాధారణంగా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డుతో ఆన్ లైన్ లావాదేవీలు జరుపాలంటే 16 అంకెల కార్డ్ నంబర్, ఎక్స్పైరీ డేట్, పుట్టినతేదీ, పాస్ వర్డ్, సీవీవీ నంబర్ తప్పనిసరిగా నమోదు చేయాల్సిందే. సీవీవీ నంబర్ నమోదు చేయకుండా ఆన్ లైన్ లావాదేవీలు ముందుకు సాగవు. కానీ, టోకెనైజేషన్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఆన్ లైన్ లావాదేవీకి సీవీవీ నంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు టోకెనైజేషన్ పూర్తయితే వర్చువల్ ఐడీ నంబర్ ఒకటి వస్తుంది. దాంతోనే లావాదేవీలు హాయిగా చేసేయవచ్చు. టోకెనైజేషన్ తర్వాత దేశీయ మర్చంట్ల వద్ద జరిపే ఆన్ లైన్ లావాదేవీలకు మళ్లీ `సీవీవీ` నంబర్ నమోదు చేయాల్సిన అవసరం లేదు.
సురక్షితంగా, సేఫ్టీగా వేగంగా లావాదేవీలు జరుపడమే లక్ష్యంగా వీసా కార్డు.. దేశీయంగా ఆన్ లైన్ లావాదేవీలకు సీవీవీ ఫ్రీ ట్రాన్సాక్షన్స్ తీసుకొచ్చింది. క్రెడిట్ కార్డు లేకుండా టోకెనైజేషన్ లావాదేవీలు 2-ఫ్యాక్టర్ అథంటికేటెడ్, ఎన్ క్రిప్టెడ్ టోకెన్ సాయంతో పూర్తి చేయొచ్చు. దేశవ్యాప్తంగా గత మార్చి నెలాఖరు నాటికి 250 మిలియన్లకు పైగా టోకెన్ నంబర్లను జారీ చేసింది. గతేడాది అక్టోబర్ నుంచి క్రెడిట్ లేదా డెబిట్ కార్డులకు టోకెనైజేషన్ మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

