Gold Smuggling | ఏప్రిల్-జూన్ మధ్య 848 కిలోల ‘స్మగ్లింగ్’ బంగారం జప్తు.. నిర్మలా సీతారామన్ వెల్లడి
Gold Smuggling | గత ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.544 కోట్ల విలువైన 847 కిలోల బంగారాన్ని జప్తు చేశామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
Gold Smuggling | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికంలో కస్టమ్స్, రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) కలిసి దేశంలోని వివిధ విమానాశ్రయాల నుంచి అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న 847 కిలోల బంగారాన్ని జప్తు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గత ఏప్రిల్ నుంచి జూన్ వరకూ 1282 కేసుల్లో 847.43 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నామని, దాని విలువ రూ.543.61 కోట్లు ఉందని చెప్పారు. మంగళవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ 2021-22 నుంచి 2024-25 వరకూ దేశంలోని వివిధ విమానాశ్రయాలు, నౌకాశ్రయాల వద్ద కస్టమ్స్, రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు స్వాధీనం చేసుకున్న ‘స్మగ్లింగ్ బంగారం’ వివరాలను వెల్లడించారు.
గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 3714 కిలోల బంగారం (రూ.2081 కోట్లు) జప్తు చేశామని నిర్మలా సీతారామన్ తెలిపారు. 5962 కేసులు నమోదయ్యాయన్నారు. 2022-23లో రూ.1382 కోట్ల విలువైన 2,776 కిలోల బంగారం, 2021-22లో రూ.572 కోట్ల విలువ గల 1240 కిలోల బంగారం జప్తు చేసినట్లు వెల్లడించారు. నౌకాశ్రయాల వద్ద గత ఆర్థిక సంవత్సరంలో 1.28 కిలోల బంగారం (రూ.066 కోట్లు) జప్తు చేశామన్నారు. గత త్రైమాసికంలో 132 కేసుల్లో 152 మంది నిందితులను ప్రాసిక్యూట్ చేశామని నిర్మలా సీతారామన్ తెలిపారు. 2023-24లో 174 కేసుల్లో 280 మందిని ప్రాసిక్యూట్ చేసినట్లు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి :
Realme | రియల్మీ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లు రియల్మీ 13 ప్రో.. రియల్మీ 13 ప్రో+ ఆవిష్కరణ
LTCG Tax | ఎల్టీసీజీ రద్దు ప్రతిపాదనే లేదు.. తేల్చేసిన కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి
Gold – Silver Rates | భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు.. యూఎస్ ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించేనా..?!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

