5జీలో చార్జీల మోతే!
మొబైల్ ఫోన్ వినియోగదారులు.. 5జీ సేవల కోసం మరింతగా ఖర్చు చేయాల్సి రావచ్చు. ఇప్పుడున్న 4జీ కంటే 5జీలో ప్లాన్ల ధరలు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి. ఆయా టెలికం సంస్థలు దాదాపు 10-20 శాతం అధికంగా 5జీ ప్లాన్ల ధరల్ని నిర్ణయించవచ్చని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.
- 4జీ ప్లాన్ల కంటే 10-20 శాతం
- ధరలు ఎక్కువగా ఉండే అవకాశం
న్యూఢిల్లీ, జూలై 21: మొబైల్ ఫోన్ వినియోగదారులు.. 5జీ సేవల కోసం మరింతగా ఖర్చు చేయాల్సి రావచ్చు. ఇప్పుడున్న 4జీ కంటే 5జీలో ప్లాన్ల ధరలు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి. ఆయా టెలికం సంస్థలు దాదాపు 10-20 శాతం అధికంగా 5జీ ప్లాన్ల ధరల్ని నిర్ణయించవచ్చని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. 5జీ సేవలు ప్రీమియం శ్రేణి రేడియో తరంగాల్లో అందుబాటులో ఉండనున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుత 4జీ కంటే 5జీలో ఇంటర్నెట్ వేగం కూడా 10 రెట్లు అధికంగా రానుంది. ఫలితంగా దీనికి తగ్గట్టుగానే చార్జీల మోత మోగుతుందన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి.
ఇప్పటికే 2జీ, 3జీల కంటే 4జీ ప్లాన్ల ధరల్ని టెలికం సంస్థలు ఎక్కువగా నిర్ణయించాయి. అలాగే 4జీ కంటే 5జీ ప్లాన్లూ ప్రియంగానే ఉండొచ్చని నొమురా రిసెర్చ్ అంటున్నది. 5జీలో ఒక్కో వినియోగదారుని సగటు ఆదాయాన్ని (ఏఆర్పీయూ) టెలికం సంస్థలు పెంచాలని కూడా భావిస్తుండటం.. ప్లాన్ల రేట్లను పరుగులు పెట్టించవచ్చని పేర్కొన్నది. ఈ నెల 26 నుంచి 5జీ స్పెక్ట్రం వేలం మొదలు కానున్నది. రూ.4.3 లక్షల కోట్ల విలువైన 72 గిగాహెట్జ్ల స్పెక్ట్రంను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలతోపాటు అదానీ గ్రూప్ కూడా పోటీలో ఉన్న విషయం తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

