Credit Card | క్రెడిట్ కార్డులు తెగ వాడేస్తున్నారు.. మార్చిలో ఆల్‌టైం హై స్పెండింగ్!
Credit Card | కరోనా తర్వాత క్రెడిట్ కార్డు వాడకం విపరీతంగా పెరిగింది. గత మార్చిలో రూ.1.37 లక్షల కోట్ల ఖర్చుతో ఆల్ టైం రికార్డ్ నమోదైంది.
Credit Card | గ్రాసరీ కొనుగోళ్లు.. ఫ్యూయల్ వాడకం.. శుభకార్యాల ఖర్చులు.. బంగారం కొనుగోళ్లు.. ప్రతి ఒక్కటి అవసరమే.. గతంతో పోలిస్తే పెరుగుతున్న ఆదాయాలకు అనుగుణంగా ఖర్చులూ పెరుగుతున్నాయి. మిలినియల్స్.. భారీగా సంపాదిస్తుండటంతో ఖర్చు కూడా అలాగే చేస్తేస్తున్నారు. అయితే, కరోనా మహమ్మారి వేళ.. కాసింత ఖర్చు తగ్గినా.. తర్వాత ప్రజల ఖర్చులు క్రమంగా పెరుగుతున్నాయి. విచక్షణాయుతంగా ఖర్చు చేస్తున్నా గత నెలలో క్రెడిట్ కార్డుల వినియోగం ఆల్‌టైం రికార్డులు నమోదు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మార్చిలో రూ.1.37 లక్షల కోట్ల మేరకు క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు చేశారు. ఇలా క్రెడిట్ కార్డు వినియోగం రూ.లక్ష కోట్లు దాటడం వరుసగా 13వ నెల. గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో క్రెడిట్ కార్డు వినియోగం రూ.14 లక్షల కోట్లకు చేరుకున్నది. 2021-22తో పోలిస్తే రూ.9.71 లక్షల కోట్ల నుంచి 47.27 శాతం గ్రోత్ నమోదైంది.
దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డుల సంఖ్య ఎంతంటే?..
గత నెలలో వివిధ బ్యాంకులు కొత్తగా 19.3 లక్షల క్రెడిట్ కార్డులు జారీ చేయడంతో మొత్తం దేశవ్యాప్తంగా వినియోగంలో ఉన్న క్రెడిట్ కార్డుల సంఖ్య 85.3 మిలియన్లు. 2022 మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చి వరకు గత ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెలా కొత్తగా 12 నుంచి 15 లక్షల క్రెడిట్ కార్డులు జారీ అయ్యాయి. 2021-22లో కొత్తగా 11.15 మిలియన్ల క్రెడిట్ కార్డులు జారీ అయితే, గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 11.67 మిలియన్ల క్రెడిట్ కార్డులు జారీ అయ్యాయని ఆర్బీఐ డేటా తెలిపింది.
మెజారిటీ లావాదేవీలు ఈ-కామర్స్ వేదికలపైనే
క్రెడిట్ కార్డుల వినియోగంలో 63 శాతం అంటే రూ.86 వేల కోట్ల పై చిలుకు వరకు ఈ-కామర్స్ లావాదేవీలు జరిపితే, మిగతా పాయింట్ ఆఫ్ సేల్స్ (పీవోఎస్) టర్మినల్స్ వద్ద ట్రాన్సాక్షన్స్ సాగుతున్నాయి. 2022 మార్చిలో 15 శాతం క్రెడిట్ కార్డు వినియోగం పెరిగితే, ఈ ఏడాది మార్చిలో 28 శాతంగా నమోదైంది.
అక్టోబర్‌లో ఫెస్టివ్ సీజన్ వల్ల అత్యధిక లావాదేవీలు
ఈ ఏడాది మార్చి తర్వాత గతేడాది అక్టోబర్‌లో క్రెడిట్ కార్డుతో రూ.1.29 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. అక్టోబర్‌లో ఫెస్టివ్ సీజన్ కావడమే దీనికి కారణం. ఇక ఫిబ్రవరితో పోలిస్తే గత నెలలో క్రెడిట్ కార్డుల వాడకంలో యాక్సిస్ బ్యాంక్ 54 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 20 శాతానికి పైగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 14, ఎస్బీఐ కార్డు వినియోగం 11 శాతం పెరిగింది.
కొత్త క్రెడిట్ కార్డుల్లో యాక్సిస్ బ్యాంక్ దే పై చేయి
కొత్తగా యాక్సిస్ బ్యాంక్ (సిటీ బ్యాంక్) 2.34 మిలియన్ల క్రెడిట్ కార్డులు జారీ చేయడంతో మొత్తం గత మార్చి నెలాఖరు నాటికి దేశవ్యాప్తంగా ఆ బ్యాంక్ క్రెడిట్ కార్డు బేస్ 12.1 మిలియన్లకు చేరుకున్నది. తర్వాతీ జాబితాలో ఐసీఐసీఐ బ్యాంక్ 7,20,239 కార్డులు జారీ చేసింది. దీంతో ఐసీఐసీఐ బ్యాంక్ మొత్తం క్రెడిట్ కార్డులు 14.4 మిలియన్లకు చేరాయి. ఇక ఎస్బీఐ కార్డు 2,56,463 కార్డులు జారీ చేయడంతో మొత్తం ఆ సంస్థ క్రెడిట్ కార్డులు 16.76 మిలియన్ల వద్ద నిలిచాయి. దేశంలోనే అతిపెద్ద క్రెడిట్ కార్డుల జారీ బ్యాంక్.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్తగా 2,36,770 కార్డులు జారీ చేసింది. దీంతో మార్చి నెలాఖరు నాటికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ జారీ చేసిన క్రెడిట్ కార్డుల సంఖ్య 17.53 మిలియన్ల వద్ద నిలిచింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

