Credit Card | ఇక క్రెడిట్ కార్డులకు ఫుల్ గిరాకీ.. ఎందుకో తెలుసా?!
Credit Card | పండుగల సీజన్ కావడంతో ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్‌లో క్రెడిట్ కార్డుల వాడకం 14 శాతం పెరిగింది.
Credit Card | గతంతో పోలిస్తే గ్రాసరీ కొనుగోళ్లలో క్రెడిట్ కార్డు వాడకం పెరుగుతున్నది. ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్ నెలలో క్రెడిట్ కార్డుల వాడకం 14 శాతం ఎక్కువైంది. గణేష్ చతుర్ధితో పండుగల సీజన్ ప్రారంభం కావడం కూడా క్రెడిట్ కార్డుల వాడకం పెరిగిందని చెబుతున్నారు. ఆన్లైన్ వ్యయం మాత్రం 0.7 శాతమే పెరిగింది. ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా ఏడాది పాటు ఇన్‌యాక్టివ్‌గా ఉన్న క్రెడిట్ కార్డులను బ్యాంకులు రద్దు చేస్తున్నాయి. ఆగస్టులో స్టోర్లలో క్రెడిట్ కార్డులతో రూ.67,414 కోట్ల విలువైన లావాదేవీలు జరిగితే, గత నెలలో రూ.77,267 కోట్ల విలువ గల ట్రాన్సాక్షన్స్ చోటు చేసుకున్నాయి.
ఆగస్టులో ఈ-కామర్స్ సంస్థల్లో వస్తువుల కొనుగోలుకు రూ.44,943 కోట్ల విలువైన క్రెడిట్ కార్డు లావాదేవీలు జరిగితే, గత నెలలో స్వల్పంగా రూ.45,287 కోట్లకు పెరిగాయి. ఇటీవలే ఆన్లైన్, ఇన్‌స్టోర్ లావాదేవీల డేటాను ఆర్బీఐ విడుదల చేస్తున్నది. 2021 సెప్టెంబర్‌లో రూ.80,227 కోట్ల విలువైన లావాదేవీలు చోటు చేసుకుంటే, గత నెలలో రూ.1,22,553 కోట్ల ట్రాన్సాక్షన్స్ నమోదయ్యాయి.
ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్‌లో క్రెడిట్ కార్డులు 7.79 కోట్ల నుంచి 7.77 కోట్లకు పడిపోయాయి. గత నెలలో ఐసీఐసీఐ బ్యాంక్ సుమారు 6.2 లక్షల క్రెడిట్ కార్డులు రద్దు చేయడంతో ఇప్పుడు ఆ బ్యాంకులో 1.3 కోట్ల క్రెడిట్ కార్డు యూజర్లు ఉన్నారు. అంటే 4.4 శాతం ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులు రద్దయ్యాయి.
స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ లక్ష క్రెడిట్ కార్డుల (సుమారు 7.8 శాతం) ను కోల్పోయింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లక్షకు పైగా క్రెడిట్ కార్డులను కోల్పోయి 1.6 కోట్ల కార్డులు మాత్రమే కలిగి ఉంది. కొత్తగా కొటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఎం బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులు క్రెడిట్ కార్డులు జారీ చేశాయి. గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది క్రెడిట్ కార్డులు దాదాపు కోటి పెరిగి 6.5 కోట్లకు చేరాయి.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న క్రెడిట్ కార్డుల్లో ఎస్బీఐ కార్డుల వాడకం ఆన్లైన్లో 32 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు 26 శాతం, యాక్సిస్ బ్యాంక్ 42 శాతం ఉన్నాయి. ఆన్లైన్ వాడకంలో యాక్సిస్ బ్యాంక్ 13 శాతం, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుల వాడకం 6 శాతం పెరిగింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

