Credit Card | బీబీపీఎస్ ఎనేబుల్ చేసుకుంటేనే స్మూత్‌గా క్రెడిట్ కార్డు బిల్లు పేమెంట్స్.. లేదంటే..?!
Credit Card | క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపుల్లో భద్రతను పెంపొందించేందుకు జూలై ఒకటో తేదీ నుంచి క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపులు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా మాత్రమే చేయాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.
Credit Card | గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డు (Credit Card) వాడుతున్నారు. క్రెడిట్ కార్డు కల వారు ప్రతి నెలా ‘క్రెడిట్ బిల్లు’ పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అన్ని రకాల పేమెంట్స్ డిజిటల్‌గా సాగుతున్న నేపథ్యంలో అందరూ ఫోన్‌పే (PhonePe), క్రెడ్ (CRED) వంటి థర్డ్ పార్టీ యాప్స్ వినియోగిస్తున్నారు. యూపీఐ ఆధారిత మొబైల్ యాప్స్ ద్వారా అన్ని రకాల పేమెంట్స్ జరుగుతుండటంతో చాలా మంది వీటినే వాడుతుంటారు. ఇక నుంచి క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించడానికి ఆర్బీఐ కొత్త నిబంధన తీసుకొచ్చింది.
భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) ద్వారా క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించాలని ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధన జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నది. క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపుల్లో సెక్యూరిటీ, ఎఫిషియెన్సీ కోసం ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నది. దీంతో బ్యాంకులన్నీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ఎనేబుల్ చేసుకోవాలి. దేశంలో క్రెడిట్ కార్డులు జారీ చేసిన 34 బ్యాంకుల్లో భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ సహా ఎనిమిది బ్యాంకులే ‘బీబీపీఎస్’ సిస్టమ్ యాక్టివేట్ చేసుకున్నాయి.
అయితే, దేశీయంగా అత్యధికంగా క్రెడిట్ కార్డులు జారీ చేసిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి బ్యాంకులు మాత్రం ఈ ‘బీబీపీఎస్’ను యాక్టివేట్ చేసుకోలేదు. అధికారిక గణాంకాల ప్రకారం ఈ బ్యాంకులే ఐదు కోట్లకు పైగా క్రెడిట్ కార్డులు జారీ చేశాయి. ఫోన్‌పే, క్రెడ్ వంటి సంస్థలు బీబీపీఎస్‌లో సభ్యులైనా.. సంబంధిత బ్యాంకులు బీబీపీఎస్’ను యాక్టివేట్ చేసుకోకపోవడం వల్ల ఈ బ్యాంకుల క్రెడిట్ కార్డుల బిల్లులను ఫోన్‌పే, క్రెడ్ వంటి సంస్థలు ప్రాసెస్ చేయలేవు. దీనివల్ల మొబైల్ యాప్స్ ద్వారా కార్డు బిల్లు పేమెంట్ జరుగదు. కానీ సంబంధిత బ్యాంకు వెబ్ సైట్, యాప్ ద్వారా పేమెంట్స్ చేయడానికి ఇబ్బందుల్లేవు. ఈ పరిస్థితుల్లో బీబీపీఎస్ సిస్టమ్ ఏనేబుల్ చేసుకునేందుకు కనీసం 90 రోజుల గడువు పెంచాలని బ్యాంకులు ఆర్బీఐని కోరుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
Samsung Galaxy S24 Ultra | టైటానియం ఎల్లో కలర్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా.. ఇవీ డిటైల్స్..!
SBI | ఈ ఏడాది కొత్తగా 400 శాఖలు ప్రారంభిస్తాం.. తేల్చేసిన ఎస్బీఐ చైర్మన్ ఖరా..!
Citroen C3 Aircross | సిట్రోన్ బంపరాఫర్.. సీ3 ఎయిర్ క్రాస్‌పై రూ.2.62 లక్షల వరకూ డిస్కౌంట్..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

