Credit Card Loans | రూ.2.6 లక్షల కోట్లకు చేరిన బ్యాంక్‌ల క్రెడిట్ కార్డ్ రుణాలు
అన్సెక్యూర్డ్ రుణాలపై రిజర్వ్‌బ్యాంక్ రిస్క్ వెయిటేజీ పెంచినప్పటికీ, బ్యాంక్‌ల క్రెడిట్ కార్డ్ రుణాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. 2024 జనవరి నెలలో బ్యాంక్‌లు క్రెడిట్ కార్డులపై ఇచ్చిన రుణాలు 31.3 శాతం పెరిగి రూ.2.6 లక్షల కోట్లకు చేరాయి.
Credit Card Loans | న్యూఢిల్లీ, మార్చి 4: అన్సెక్యూర్డ్ రుణాలపై రిజర్వ్‌బ్యాంక్ రిస్క్ వెయిటేజీ పెంచినప్పటికీ, బ్యాంక్‌ల క్రెడిట్ కార్డ్ రుణాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. 2024 జనవరి నెలలో బ్యాంక్‌లు క్రెడిట్ కార్డులపై ఇచ్చిన రుణాలు 31.3 శాతం పెరిగి రూ.2.6 లక్షల కోట్లకు చేరాయి. 2023 డిసెంబర్లో ఇవి రూ.2.5 లక్షల కోట్లు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ క్రెడిట్ కార్డ్ ఎక్స్ఫోజరు 26.3 శాతం వృద్ధిచెందింది.
అన్సెక్యూర్డ్ రిటైల్ రుణాలు బాగా పెరగడం వ్యవస్థాపర రిస్క్‌లకు దారితీస్తుందన్న ఆందోళనల్ని ఆర్బీఐ వ్యక్తం చేస్తూ బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు ఇచ్చే తనఖాలేని వినియోగ రుణాలపై గత ఏడాది నవంబర్‌లో రిస్క్ వెయిట్‌ను 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. అంటే వాటిపై ఆర్థిక సంస్థలు అధిక కేటాయింపులు జరపాల్సి ఉంటుంది. దీంతో వ్యక్తిగత రుణాల వృద్ధి డిసెంబర్లో 26.6 శాతం ఉండగా, జనవరిలో 23.3 శాతానికి తగ్గింది. కానీ క్రెడిట్ కార్డు రుణాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
పలువురికి బానోత్ మనీషా లక్ష్మి పరామర్శ
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
BRS | మాజీ ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన యువత
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

