Credai properties | ఫిబ్రవరి 11 నుంచి క్రెడాయ్ ప్రాపర్టీ షో
Credai properties | క్రెడాయ్ 11వ ఎడిషన్ హైదరాబాద్ ప్రాపర్టీ షో వచ్చే ఫిబ్రవరి 11 నుంచి 13 వరకు మాదాపూర్‌లోని హైటెక్స్‌లో జరగనుంది. మూడు రోజులపాటు జరుగనున్న ఈ కార్యక్రమంలో టీఎస్ రెరా ఆమోదించిన

సిటీబ్యూరో, డిసెంబర్ 30 : క్రెడాయ్ 11వ ఎడిషన్ హైదరాబాద్ ప్రాపర్టీ షో వచ్చే ఫిబ్రవరి 11 నుంచి 13 వరకు మాదాపూర్‌లోని హైటెక్స్‌లో జరగనుంది. మూడు రోజులపాటు జరుగనున్న ఈ కార్యక్రమంలో టీఎస్ రెరా ఆమోదించిన ప్రాపర్టీలు మాత్రమే ప్రదర్శనలో ఉంటాయని అధ్యక్షుడు రామకృష్ణారావు, జనరల్ సెక్రటరీ వీ రాజశేఖర్ రెడ్డిలు తెలిపారు. కొవిడ్ నిబంధనలను అనుసరించి 110 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నామని, వీటిలో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, రిటైల్ కమర్షియల్ కాంప్లెక్స్‌లకు సంబంధించి ప్రాజెక్టులను ప్రదర్శించనున్నామని చెప్పారు. సమీప భవిష్యత్తులో నగరంలో మూడు డాటా సెంటర్లు రానున్నాయని, వీటితో వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని జనరల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ హైదరాబాద్ శాఖ కోశాధికారి ఆదిత్య గౌరా, నితీష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

