Serum Vaccine for Cervical Cancer | కొవిడ్ తగ్గుముఖం.. నవంబర్‌కల్లా సీరం గర్భాశయ క్యాన్సర్ టీకా రెడీ!
Serum Vaccine for Cervical Cancer | గర్భాశయ క్యాన్సర్ కట్టడికి నవంబర్‌కల్లా సీరం తొలి దేశీయ వ్యాక్సిన్ తెస్తున్నది.
Serum Vaccine for Cervical Cancer | కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో దాని నియంత్రణకు వ్యాక్సిన్ల గిరాకీ నెమ్మదించింది. దేశంలోనే అతిపెద్ద ఫార్మా సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ).. గర్భాశయ క్యాన్సర్‌కు అడ్డుకట్ట వేసేందుకు దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి వ్యాక్సిన్‌ను ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. వచ్చే నవంబర్ చివరిలోగా ఆవిష్కరిస్తుందని సమాచారం. గర్భాశయ క్యాన్సర్‌కు ప్రధాన కారణాల్లో ఒకటైన హ్యూమన్ పపిల్లోమా వైరస్ (హెచ్‌పీవీ)కి వ్యతిరేకంగా ఈ వ్యాక్సిన్ పని చేస్తుంది.
2017 లోనే ఈ వ్యాక్సిన్‌ను యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్‌లో చేర్చేందుకు సాంకేతిక నిపుణుల కమిటీ అనుమతి ఇచ్చింది. కానీ దేశవ్యాప్తంగా అమల్లోకి రాలేదు. ఈ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించే విషయమై సీరం వర్గాలు స్పందించలేదు. భారీ మొత్తంలో మార్కెట్లోకి అందుబాటులోకి తేవడం కన్నా దశల వారీగా ఈ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి రానున్నదని సమాచారం. ఈ వ్యాక్సిన్ ధరవరలు ఇంకా ఖరారు కాలేదని తెలియవచ్చింది.
ప్రస్తుతం మెర్క్ ఆధ్వర్యంలోని హెచ్‌పీవీ వ్యాక్సిన్ గర్దాసిల్, గ్లాస్కో స్మిత్‌లైన్ వారి సెర్వారిక్స్ మాత్రమే ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సెర్వారిక్స్ వ్యాక్సిన్ మూడు డోస్‌లు వేసుకోవాలి. సెర్వారిక్స్ ఒక డోస్ వ్యాక్సిన్ ధర సుమారు రూ.2,100 పలుకుతుంది. గర్దాసిల్ వ్యాక్సిన్ ఒక డోస్ ధర రూ.3,100. ఇది రెండు డోస్‌లు వేసుకోవాలి. రోగుల వయస్సును బట్టి ఎన్ని డోస్‌లు వేయాలో వైద్యులు నిర్ణయిస్తారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

