హైదరాబాద్, జూలై 27: కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్-జూన్లో రూ.494.03 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం నమోదైనరూ. 499.08 కోట్ల కంటే ఇది ఒక్క శాతం తక్కువ. అటు ఆదాయం కూడా రూ.5,782 కోట్ల నుంచి రూ.5,737 కోట్లకు పడిపోయింది.