హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్లోని ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ కంపెనీపై మంగళవారం ఐటీ దాడులు జరిగాయి. ముంబై నుంచి 25 వాహనాల్లో వచ్చిన సుమారు 200 మంది అధికారులు ఏకకాలంలో సోదాలు చేసినట్టు సమాచారం.
నగరంలోని ఫీనిక్స్ ప్రధాన కార్యాలయంతోపాటు సంస్థ చైర్మన్, డైరెక్టర్ల ఇళ్లలోనూ ఏకకాలంలో 20 చోట్ల దాడులు నిర్వహించినట్టు తెలిసింది. ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం చేస్తున్నది. వెంచర్లు, రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాలో పెట్టుబడులు పెట్టింది. దీనిపై ఇన్కం టాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.