నగదు లభ్యతనుబట్టి ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ), రికరింగ్ డిపాజిట్ల (ఆర్డీ)లో పెట్టుబడులు పెడతాం. నగదు నిల్వలుంటే ఎఫ్డీల్లో.. లేదంటే నెలనెలా ఆర్డీల్లో డిపాజిట్లు చేస్తాం. నిర్దేశిత వ్యవధికిగాను నిర్ణీత మొత్తాల్లో నెలనెలా చెల్లిస్తే.. కాలపరిమితి అనంతరం వడ్డీతోసహా సదరు సొమ్ము ఆర్డీల్లో వస్తుంది. రికరింగ్ డిపాజిట్లపై తపాలా శాఖ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐల్లో ఆకర్షణీయ వడ్డీరేట్లున్నాయి. వాటిని ఒక్కసారి పరిశీలిస్తే.. తపాలా శాఖలో ఐదేండ్ల ఆర్డీలకు 5.8 శాతం వడ్డీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో 6 నెలలు-పదేండ్లకు 3.75 శాతం నుంచి 5.75 శాతం వడ్డీ, ఐదేండ్లకు 6.7 శాతం వడ్డీ వస్తున్నది. ఐసీఐసీఐ బ్యాంక్లో 3-5 ఏండ్లకు 5.7 శాతం, ఆపై కాలానికి 5.75 శాతం వడ్డీ ఇస్తున్నారు. ఇక ఎస్బీఐలో ఐదేండ్లు, ఆపై డిపాజిట్లకు 5.5 శాతం, 3-5 ఏండ్లకు 5.45 శాతం వడ్డీ ఉన్నది.