Coca-Cola | భారత్ మార్కెట్‌కు కోకా కోలా గుడ్‌బై.. ఈ నిర్ణయం వెనుక కారణాలేంటి..?!
Coca-Cola | ప్రముఖ శీతల పానీయాల తయారీ సంస్థ కోకాకోలా.. భారత్ లో తన అనుబంధ సంస్థ- హిందూస్థాన్ కోకాకోలా బేవరేజెస్’లో మైనారిటీ వాటా విక్రయించేందుకు సిద్ధమైంది.
Coca-Cola | ప్రముఖ శీతల పానీయాల కంపెనీ కోకాకోలా (Coca Cola).. భారత్ మార్కెట్ నుంచి వైదొలగనున్నదా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా బాట్లింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్న కోకాకోలా (Coca Cola) తన బాట్లింగ్ ఇన్వెస్ట్ మెంట్స్ గ్రూప్ (Bottling Investments Group) ను మూసేయాలని ఆదివారం నిర్ణయించింది. భారత్ లో తమ కార్యకలాపాలను తగ్గించుకోవాలని కోకాకోలా భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం హిందూస్థాన్ కోకాకోలా బేవరేజెస్ (Hindustan Coca-Cola Beverages – HCCB)లో గణనీయ స్థాయిలో మైనారిటీ వాటాను విక్రయించ తలపెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నాలుగు భారత వ్యాపార సంస్థలను, వాటి యాజమాన్య కుటుంబాలను కోకాకోలా సంప్రదించినట్లు సమాచారం. దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కోసం ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వెళ్లే ముందు మైనారిటీ వాటా విక్రయించాలని కోకాకోలా భావిస్తున్నట్లు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఓ వార్తా కథనం ప్రచురించింది. బాట్లింగ్ ఇన్వెస్ట్ మెంట్ గ్రూప్ మూసివేతకు కారణాలు మాత్రం కోకాకోలా వెల్లడించలేదు.
కోకాకోలా ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ప్రెసిడెంట్ హెన్రిక్యూ బ్రౌన్ ఈ మేరకు సంస్థ ఉద్యోగులు, ఎగ్జిక్యూటివ్ లకు ఇంటర్నల్ నోట్ పంపిణీ చేశారు. ‘జూన్ 30 నుంచి బిగ్ (BIG) కార్పొరేట్ ఆఫీసు మూసేస్తున్నాం. బిగ్ హెడ్ క్వార్టర్స్‌ను మూసేస్తాం. మిగతా బాట్లింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను క్రమబద్ధీకరిస్తాం’ అని హెన్రిక్యూ బ్రౌన్ పేర్కొన్నారు. భారత్, నేపాల్, శ్రీలంక కార్యకలాపాలను కోకాకోలా ఇంటర్నల్ బోర్డు పర్యవేక్షిస్తుందని ఆ నోట్ పేర్కొంది. భారత్‌లో బిగ్ పర్యవేక్షణలో నడుస్తున్న హిందూస్థాన్ కోకాకోలా బేవరేజెస్ (Hindustan Coca-Cola Beverages – HCCB)పై నేరుగా ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.
గత జనవరిలో హెచ్‌సీసీబీ దేశంలోని తమ కంపెనీ ఆధీనంలోని బాట్లింగ్ కార్యకలాపాలను మూడు సంస్థలకు విక్రయించింది. నార్త్రన్ ఇండియాలో మూన్ బేవరేజెస్, ఈస్ట్రన్ ఇండియాలో ఎస్ఎల్ఎంజీ బేవరేజెస్, ఈశాన్య భారత్ లో కంధారి గ్లోబల్ బేవరేజెస్ సంస్థలకు విక్రయించింది. తద్వారా కోకాకోలా 293 మిలియన్ డాలర్లు లాభ పడింది. దీని తర్వాత పశ్చిమ, దక్షిణ భారత రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 16 ఫ్యాక్టరీలను మాత్రమే హెచ్‌సీసీబీ నిర్వహిస్తోంది. 2006లో కోకాకోలా తన బాట్లింగ్ ఇన్వెస్ట్ మెంట్స్ గ్రూప్ ఆధ్వర్యంలో దేశంలో బాట్లింగ్ ఆపరేషన్స్ ప్రారంభించింది.
ఇవి కూడా చదవండి :
Oppo Reno 12F 5G | ఒప్పో ప్రీమియం ఫోన్ ఒప్పో రెనో 12ఎఫ్ 5జీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
World Bank | గ్రీన్ ఎనర్జీ కోసం భారత్‌కు ప్రపంచ బ్యాంకు 150 కోట్ల డాలర్ల రుణం..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

