CNG Cars | ఆ కార్లపై ఇండియన్స్ మోజు.. మొత్తం సేల్స్‌లో సీఎన్జీ వాటా ఎంతంటే?!
CNG Cars | పెట్రోల్, డీజిల్ వేరియంట్లతో పోలిస్తే నిర్వహణ ఖర్చు తక్కువ కావడంతో అంతా సీఎన్జీ కార్ల వైపే మొగ్గుతున్నారు.
CNG Cars | ఒకవైపు సీఎన్జీ గ్యాస్ ధరలు పెరుగుతున్నా.. సీఎన్జీ వేరియంట్ కార్లకు క్రమంగా గిరాకీ పెరుగుతున్నది. ఈ ఏడాది మొత్తం కార్ల విక్రయాల్లో సీఎన్జీ వేరియంట్ కార్లు 10 శాతం ఉంటాయి. గత జనవరి కార్ల విక్రయాల్లో సీఎన్జీ కార్లు ఎనిమిది శాతం పెరిగాయి. డీజిల్, పెట్రోల్ వేరియంట్ కార్లతో పోలిస్తే సీఎన్జీ గ్యాస్‌తో కార్ల నిర్వహణ కాసింత చౌక కావడంతో ఇండియన్స్ ఎక్కువగా సీఎన్జీ వేరియంట్లపైనే మోజు పెంచేసుకుంటున్నారు. కార్ల తయారీ సంస్థలు సైతం కొత్తగా సీఎన్జీ కార్ల ఆవిష్కరణకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అంతే కాదు. సేల్స్ పెంచుకోవడానికి అధిక క్యాష్ ఇన్సెంటివ్లిస్తున్నాయి.
పెట్రోల్ లేదా డీజిల్ వేరియంట్ కార్లు లేదా ఇతర వెహికల్స్ నిర్వహణకు ప్రతి కిలోమీటర్‌కు రూ.5.30-5.45 ఖర్చయ్యేది. కానీ ప్రతి సీఎన్జీ కారు నిర్వహణకు కిలో మీటర్‌కు రూ.2.50-2.60 మధ్య ఖర్చవుతున్నది. అంటే పెట్రోల్ లేదా డీజిల్ వేరియంట్లతో పోలిస్తే సీఎన్జీ వేరియంట్ కార్ల మెయింటెనెన్స్ కోసం సగానికి కంటే తక్కువ ఖర్చు చేస్తే సరిపోతుందని మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ తేల్చేశారు. దేశంలో సీఎన్జీ వేరియంట్ కార్లు మార్కెట్లోకి తీసుకొచ్చిన సంస్థ మారుతి సుజకి కావడం గమనార్హం.
కిలో సీఎన్జీ ధర జనవరి నుంచి 48 శాతం పెరిగి రూ.78.61కి పెరిగింది. అయినా, సీఎన్జీ వేరియంట్ కార్లు గత జనవరి నుంచి అక్టోబర్ వరకు 22,807 నుంచి 33,529 యూనిట్లకు పెరిగాయని ఆటోమోటివ్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ జాటో డైనమిక్స్ తేల్చేసింది. కస్టమర్ల నుంచి వచ్చిన డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న కార్ల తయారీ సంస్థలు సీఎన్జీ వేరియంట్లపై గత నెల కంటే ఈ నెలలో అధిక ఇన్సెంటివ్‌లు ఆఫర్ చేస్తున్నాయి.
మారుతి సుజుకి సీఎన్జీ వేరియంట్ సెలెరియో, ఎస్-ప్రెస్సో మోడల్ కార్లపై రూ.45,000, రూ.40,000 వరకు ఇన్సెంటివ్ లు ఇస్తోంది. ఇక ఆల్టో సీఎన్జీ వేరియంట్ మీద రూ.20,000-25,000 వరకు క్యాష్ ఇన్సెంటివ్ అందిస్తున్నది.
కానీ, టాక్సీ సెగ్మెంట్ గల నగరాల పరిధిలో సీఎన్జీ కార్లదే ఆదిపత్యతం. అయితే సీఎన్జీ కార్లకు గ్యాస్ నింపుకునేందుకు అవసరమైన వసతులు తక్కువగా ఉండటం ప్రధాన సమస్యగా మారింది. 2019-20లో దేశవ్యాప్తంగా సీఎన్జీ స్టేషన్లు 2,207 నుంచి 4,709కి చేరుకున్నా.. డిమాండ్ కు సరిపోవడం లేదు. ఇక భవిష్యత్తు ఎలక్ట్రిక్ కార్లదే అని చెబుతున్నా, ప్రస్తుతం మొత్తం కార్ల విక్రయాల్లో విద్యుత్ కార్లు 1.2 శాతం మాత్రమే. పెట్రోల్ వేరియంట్ కార్లు 70.8 శాతం, డీజిల్ వేరియంట్ కార్లు 18 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

