IIIT | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): స్టార్టప్లకు అవసరమైన సీడ్ ఫండింగ్ ఇచ్చేందుకుగాను ట్రిపుల్ ఐటీలోని సీఐఈ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
15 ఏళ్ల క్రితం ప్రారంభించిన సెంటర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్(సీఐఈ)లో నిధులు లేక సతమతమవుతున్న టెక్నాలజీ స్టార్టప్లకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తున్నది. మరిన్ని వివరాలకు (https:// seed fund.startupindia.gov.in) సంప్రదించాలని సీఐఈ ప్రతినిధి తెలిపారు.