ఆలీబాబా.. ఆంట్ సీఈవో సిమోన్ హు రాజీనామా

బీజింగ్: చైనా ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మాకు చెందిన ఆంట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) సిమోన్ హు తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎరిక్ జింగ్ బాధ్యతలు స్వీకరిస్తారని ఆంట్ గ్రూప్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
సీఈవో పదవికి రాజీనామా చేసేందుకు అనుమతించాలన్న సిమోన్ హు విజ్ఞప్తిని ఆమోదిస్తున్నట్లు ఆంట్ గ్రూప్ పేర్కొంది. వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్లు ఆంట్ బోర్డుకు సిమోన్ హు విజ్ఞప్తి చేశారు. సంస్థను అభివ్రుద్ధి చేయడానికి సిమోన్ హు క్రుషిని అభినందించింది బోర్డు.
ఆలీబాబా గ్రూప్ హోల్డింగ్స్ అనుబంధ ఫిన్ టెక్ సంస్థ ఆంట్ నుంచి వైదొలిగిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారుల్లో సిమోన్ హు రెండోవారు. 2019లో సంస్థ సీఈవోగా సిమోన్ హు బాధ్యతలు చేపట్టారు. గతేడాది అక్టోబర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో జాక్ మా ప్రభుత్వ నియంత్రణల తీరును వ్యతిరేకించారు. దీనిపై చైనా ప్రభుత్వం ఆగ్రహించింది. దీంతో ఆంట్ గ్రూప్‌తోపాటు ఆలీబాబా పనితీరుపై చైనా అధికారులు నిఘా పెట్టారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

